Begin typing your search above and press return to search.

నా కూతురిని అడగొద్దు..

By:  Tupaki Desk   |   4 Sep 2017 6:33 AM GMT
నా కూతురిని అడగొద్దు..
X
బాలీవుడ్ స్టార్ హీరోలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న హీరో షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని అభిమానుల నుంచి అనేక బిరుదులను అందుకున్నా ఈ హీరో అభిమానులంటే కూడా చాలా ఇష్ట పడతాడు. అలాగే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కుటుంబ సభ్యులతో కూడా టైమ్ ను కేటాయించి వారితో గడుపుతూనే ఉంటాడు.

ఇక తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూనే వారి క్రమశిక్షణ పై కన్నేసి ఉంచుతాడట. అయితే రీసెంట్ గా తన కూతురు సుహాన తో దిగిన ఓ ఫొటోను షారుక్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇద్దరి కొడుకుల మధ్యలో పుట్టిన సుహానా అంటే షారుక్ కి ఎంతో ఇష్టమట. ఆమె ప్రస్తుతం అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. అయితే సుహానతో దిగిన ఫోటోని షారుక్ స్టైలిష్ గా అనేక ఫిల్టర్స్ తో ఎడిట్ చేశాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసి దాని మీద ఓ మంచి కామెంట్ కూడా పెట్టాడు. నా కతురు బడిలోకి వెళితే అందరు ఎందుకు ఎక్కువ ఫిల్టర్స్ వాడావు అని అడగకూడదని కామెంట్ పెట్టాడు. దీంతో అభిమానులు ఈ లుక్ లో మీరు చాలా బావున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి సుహానా కూడా హిరోయిన్ లాగా కనిపిస్తోంది. మరి హీరోయిన్ గా ట్రై చేస్తుందో లేదో చూడాలి. అయితే షారూఖ్‌ మాత్రం ఇప్పటినుండే కూతురుకి లిప్ కిస్ పెడితే పెదాలు కోసేస్తా అంటూ వార్నింగులు ఇస్తుంటాడు.