Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ దెబ్బకి పరుగులు పెట్టిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   25 July 2022 5:03 AM GMT
ఫ్యాన్స్‌ దెబ్బకి పరుగులు పెట్టిన సూపర్‌ స్టార్‌
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ ను దక్కించుకుని దశాబ్ద కాలం అయ్యింది. అయినా కూడా ఆయన స్టార్‌ డమ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పఠాన్.. జవాన్ ఇంకా డుంకీ సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్‌ ఖాన్‌ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు.

కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీ ఫ్యాన్స్ కూడా షారుఖ్‌ ఖాన్ కు ఉన్నారు. అలాంటి షారుఖ్ ఖాన్‌ తాజాగా లండన్ లో ఆ ఫ్యాన్స్ వల్ల కాస్త ఇబ్బంది పడ్డాడు. రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న డుంకీ సినిమా షూటింగ్ కోసం షారుఖ్‌ ఖాన్ ఇటీవల లండన్ వెళ్లాడు. అక్కడ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జనాలు పెద్ద ఎత్తున చుట్టు ముట్టారు.

షారుఖ్‌ ఖాన్‌ షూటింగ్‌ విషయం తెలిసి లండన్ లోని ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. దాంతో సెక్యూరిటీ సాయంతో షారుఖ్ ఖాన్ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి కార్లో కూర్చున్నాడు. అక్కడ నుండి షారుఖ్‌ ఖాన్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు స్థానిక టీమ్‌ తప్పించారు.

షారుఖ్‌ ఖాన్ ను చూసేందుకు.. ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చారని.. అందరూ ఒకేసారి షారుఖ్‌ మీద పడే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతో అక్కడ నుండి పరుగు పరుగున షారుఖ్‌ ఖాన్‌ వెళ్లి పోయాడు అంటూ డుంకీ యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. షారుఖ్‌ ఖాన్‌ డుంకీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమా అంటే బాలీవుడ్‌ తో పాటు మొత్తం దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఆయన గత సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆధరణ దక్కించుకుంటుందని అంటున్నారు.

అంతే కాకుండా త్వరలో విడుదల కాబోతున్న పఠాన్‌ మరియు సౌత్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ లు కూడా షారుఖ్‌ కు కమర్షియల్‌ గా సూపర్ హిట్స్ గా నిలుస్తాయనే నమ్మకంతో అంతా ఉన్నారు.