Begin typing your search above and press return to search.
సాఫ్ట్ గా సెటైరేస్తున్న షకలక శంకర్!
By: Tupaki Desk | 13 Aug 2018 5:12 AM GMTకమెడియన్ గా మంచి పాపులారిటీ సాధించి హీరోగా మారడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణ విషయం. అలానే తన లక్కును 'శంభో శంకర' సినిమాతో టెస్టు చేసుకున్నాడు షకలక శంకర్. దాదాపు అందరూ కమెడియన్ టర్న్డ్ హీరోల్లాగే ఓవర్ ద టాప్ హీరోయిజం తో ప్రేక్షకులమీదకు విరుచుకుపడ్డాడు. అలా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..!
కానీ ఇప్పుడు టాపిక్ అది కాదు. ఆ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ఆడియో ఫంక్షన్లో షకలక చాలామందిపై సెటైర్లు వేశాడు. గురూజీ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. తన సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం - రెండు కోట్లతో మూడు నాలుగు రెట్లు లాభం ఇచ్చే ఆఫర్ ఇస్తే ఎవ్వరూ వాడుకోలేదన్నాడు. ఇప్పుడు అది పాస్ట్. మరి ప్రెజంట్ ఏంటి? షకలక తన కొత్త సినిమా 'కేడి నెంబర్ 1' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ థాంక్స్ చెప్తూనే మీడియా పై ఇన్ డైరెక్ట్ గా పంచ్ లు విసిరాడు.
"నా ఫస్ట్ హీరో మీడియా. ఎందుకంటే మీరు లేకపోతే శంకర్ ఈరోజు ఇంతమందిలోకి వెళ్లి ఉండడు. మీరిచ్చే సపోర్ట్ ను లైఫ్ లో మర్చిపోలేను. కొంతమంది నన్ను ఒకలా చూసినా.. కొంతమంది మరోలా చూసినా - అలా చూసిన వాళ్ళు ఇలా చూసిన వాళ్ళు అందరికీ కలిపి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి. అందరూ ఉండాలి. థ్యాంక్ యు వెరీ మచ్ అన్నా సపోర్ట్ చేస్తున్నందుకు."
ఇందులో సెటైర్ ఏంటో ఇప్పటికే మీకు అర్థం అయి ఉండాలి. ఇదంతా చాలా పాలిష్డ్ గా సాఫ్ట్ టోన్ లో చెప్పాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శంకర్ మాట్లాడుతుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా (బాడీ లాంగ్వేజ్ తో సహా) అనిపించడం. మరి మీకు కూడా అలానే అనిపిస్తోందా?