Begin typing your search above and press return to search.
పవన్ కొట్టలేదంటున్న షకలక
By: Tupaki Desk | 19 March 2016 5:26 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ పోలీస్ పాత్రను పోషిస్తున్నాడు షకలక శంకర్. జబర్దస్త్ కామెడీషో లో అనేక స్కిట్స్ లో పవన్ పై తన అభిమానాన్ని చాటిన శంకర్.. ఈమధ్య పవర్ స్టార్ తో చెంపదెబ్బ తిన్నాడనే కామెంట్స్ వినిపించాయి. పవన్ పిలించి వార్నింగ్ ఇచ్చాడని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడని కూడా అన్నారు. ఈ వార్తలపై స్పందించాడు షకలక శంకర్.
'పవన్ కళ్యాణ్ ని నేనెంతగా అభిమానిస్తానో అందరికీ తెలుసు. ఆయన నాకు దేవుడితో సమానం. షూటింగ్ లో పవన్ చాలా సరదాగా ఉంటారు. కొన్ని సార్లు తనే పిలిచి నాతో పాటలు కూడా పాడించుకున్నారు. నేను చేపల పులుసు తయారీ చేసి ఆయనకు ఇచ్చినా తిన్నారు కూడా. వేరే మూవీ కోసం రాత్రి పూట కూడా వర్క్ చేస్తున్నా సరే.. సర్దార్ మూవీకి సరైన సమయానికే సెట్స్ కు వచ్చేవాడిని' అని చెప్పాడు శంకర్.
తనేదైనా సీన్ సరిగా చేయకపోయతే.. పిలిచి అలా కాదు ఇలా అని గట్టిగా చెప్పారని శంకర్ అంటున్నాడు. పవర్ స్టార్ తనను కొట్టాడన్న మాటను ఖండించాడు. సీన్ విషయంలో తనను పవన్ హెచ్చరించిన మాట నిజమే అన్న షకలక శంకర్.. పవన్ తనపై చెయ్యి చేసుకోలేదని తేల్చేశాడు.