Begin typing your search above and press return to search.
శీలవతి నెంబర్ 250
By: Tupaki Desk | 28 Jan 2018 2:46 PM ISTఒక ఇరవై ఏళ్ళు వెనక్కు వెళ్తే మలయాళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలకు సైతం నిద్రను దూరం చేసిన శృంగార తార షకీలా. ఇప్పుడంటే బోల్డ్ కంటెంట్ సినిమాల్లో కామన్ అయిపోయింది కాని అప్పట్లో చాలా నిబంధనలు ఉండేవి కాబట్టి మోడల్స్ సైతం ధైర్యంగా పోర్న్ మూవీస్ చేసే వాళ్ళు కాదు. అలాంటి టైంలో చెలరేగిపోయింది షకీలా. తెలుగులో కూడా డబ్ అయ్యే షకీలా సినిమాలు ఇక్కడ సైతం కనక వర్షం కురిపించేవి. ఒక దశలో షకీలా ప్రభంజనాన్ని, అభిమానుల తాకిడిని తట్టుకోలేక కేరళ స్టార్ హీరోలు మూకుమ్మడిగా తన సినిమాల విడుదలలు ఆపే ప్రయత్నం కూడా చేసేవారని ఇప్పటికీ అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు. టాలీవుడ్ లో సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన షకీలా ఈ మధ్య బాగా గ్యాప్ తీసుకుంది.
తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ మరోసారి తెరమీద దర్శనం ఇవ్వబోతోంది షకీలా. సాయి రామ్ దాసరి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా పేరు శీలవతీ. ఇదేంటి తేడాగా ఉంది అనుకోకండి. షకీలా రెగ్యులర్ గా చేసే సినిమాల తరహాలోనే బోల్డ్ కంటెంట్ తో ఇది రూపొందుతుందట. కాకపోతే ఈ సారి వెరైటీగా థ్రిల్లర్ జానర్ లో ఈ మూవీ చేయబోతున్నారు. అన్నింటి కన్నా పెద్ద విశేషం ఇది తనకు 250వ సినిమా అని పోస్టర్స్ లో పెద్దగా హై లైట్ చేస్తున్నారు నిర్మాతలు. అన్ని సినిమాలు చేసిందా అంటే నిజమే అంటున్నారు తన ఫాన్స్.
ఇది కేరళలో జరిగిన ఒక యాదార్ధ సంఘటన ఆధారంగా రూపొందుతోందని చెబుతున్నాడు దర్శకుడు. కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరిగేలా ఉంటుందని, మలుపులు ఊహకందని విధంగా ఉంటాయని చెబుతున్న శీలవతీ షూటింగ్ చకచక పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు కునుకు లేకుండా చేసిన శీలవతీ షకీలాను ఏజ్ బార్ అయ్యాక మనవాళ్ళు చూస్తారా అనేది విడుదల అయ్యాకే తెలుస్తుంది.