Begin typing your search above and press return to search.

ఏంటి భయ్యా ఇది.. మొన్న నమిత నేడు షకీల

By:  Tupaki Desk   |   17 July 2021 11:30 AM GMT
ఏంటి భయ్యా ఇది.. మొన్న నమిత నేడు షకీల
X
ఇటీవల నమిత మీడియాతో మాట్లాడుతూ తాను నమిత థియేటర్‌ అనే ఓటీటీని ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. నమిత ఓటీటీ మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను కూడా ప్రకటించి వరుస సినిమాలను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించింది. నమిత తన ఓటీటీ లో సినిమాలు మంచి వెబ్‌ సిరీస్ లను అందిస్తాము అంటూ ప్రకటించింది.

నమిత ఇప్పటికే కొత్త వారిని సినిమాలు మరియు ఓటీటీ కంటెంట్‌ కోసం సంప్రదిస్తూనే ఉందని సమాచారం అందుతోంది. ఇలాంటి సమయంలో నమిత నుండి వచ్చిన ప్రకటన తరహాలోనే బి గ్రేడ్‌ హీరోయిన్‌ గా ఒకప్పుడు స్టార్‌ స్టేటస్ ను దక్కించుకున్న షకీల కూడా ఓటీటీ ప్రకటన చేసింది. షకీల తన ఓటీటీలో వరుసగా సినిమాలను అందించబోతున్నట్లుగా ప్రకటించింది.

తన దత్త కూతురుతో కలిసి తాను నటించబోతున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్ లను ఆమె హైదరాబాద్‌ లో ఆవిష్కరించారు. అందులో ఒకటి అట్టర్‌ ప్లాప్ మూవీ అనే టైటిల్‌ తో రూపొందుతుంది. మరోటి రొమాన్స్ అనే టైటిల్ తో రూపొందిస్తున్నట్లుగా టైటిల్‌ ను ప్రకటించింది. ఈ సినిమాలను ఆమె తన ఓటీటీలోనే విడుదల చేస్తుందనే టాక్ ఉంది.

గతంలో తన సినిమా విడుదల కోసం సెన్సార్‌ బోర్డు చుట్టు చాలా తిరిగాను. అయినా కూడా వారు నా సినిమాకు సెన్సార్‌ ఇవ్వలేదు. అందుకే చేసేది లేక డిజిటల్ గా విడుదల చేశాను. నా సినిమా ను విడుదల చేయడం కోసం పడ్డ కష్టాలు ఇతరులు ఎవరు పడకూడదు అనే ఉద్దేశ్యంతో సొంతంగా ఓటీటీని మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించింది.

తన దత్త కూతురు అయిన ట్రాన్స్ జెండర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని షకీల చెప్పుకొచ్చింది. గతంలో 200 సినిమాల్లో నటించి ఒకానొక సమయంలో సూపర్‌ స్టార్‌ లకు కూడా పోటీగా నిలిచిన షకీల ఈమద్య కాస్త డల్‌ అయ్యింది.

ఈమె ఓటీటీ ప్రకటనతో మళ్లీ బిజీ అవుతుందని.. గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేస్తుందని నెటిజన్స్‌ నమ్మకంగా ఉన్నారు. షకీల ను ఇప్పటికి అభిమానించే వారు చాలా మందే ఉంటారు అనడంలో సందేహం లేదు. కొందరు మాత్రం నమిత.. షకీల లు ఓటీటీలు ఏంటో అంటూ జుట్టు పీక్కుంటున్నట్లుగా ఈమోజీలు షేర్‌ చేస్తూ మీమ్స్ క్రియేట్‌ చేస్తున్నారు.