Begin typing your search above and press return to search.
సెన్సార్ బోర్డ్ పై షకీలా వీరంగం
By: Tupaki Desk | 4 Feb 2020 3:30 PM GMTమలయాళ శృంగార తార షకీలాకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. షకీలా నటించిన బి గ్రేడ్ సినిమాల కోసం ఒకప్పుడు కాపుకాసుకుని కూచునేవారు. తనతో పోటీపడి రిలీజ్ కి రావాలంటే మమ్ముట్టి- మోహన్ లాల్ అంతటి స్టార్లే భయపడేవారనే టాక్ ఉంది. అయితే కాలక్రమంలో ఏజ్ పెరిగే కొద్దీ షకీలా క్రేజు పడిపోయింది. ఆ క్రమంలోనే సౌత్ సినిమాల్లో అడపాదడపా వ్యాంపు పాత్రలతో సరిపెట్టుకుంది. ఈ మల్లూ భామ టాలీవుడ్ లోనూ పలు క్రేజీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
షకీలా నటించిన గత చిత్రం షీలావతి తెలుగులోనూ రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా `లేడీస్ నాట్ ఎలోవ్డ్` అనే చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేస్తోంది. అయితే సెన్సార్ గడపపై ఈ చిత్రం ఊహించని చిక్కుల్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్ సీ బోర్డ్ నిరాకరించిందిట. అందుకు కారణమేమిటో తనకు చెప్పడం లేదని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రాంతీయ బోర్డ్ నిర్వాకంపై న్యాయపోరాటానికి పోరాటానికి సిద్ధమైంది. త్వరలోనే దిల్లీ వెళ్లి అక్కడ సెంట్రల్ బోర్డ్ వారిని నిలదీయనుందట.
తెలుగులో అసభ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలొస్తున్నా ఆపడం లేదు కానీ.. తన సినిమాల్నే ఎందుకని టార్గెట్ చేస్తున్నారు అంటూ కోపం వ్యక్తం చేసింది షకీలా. ఇటీవలే చీకటిగదిలో చితక్కొట్టుడు- ఏడు చేపల కథ లాంటి న్యూడ్ కంటెంట్ ఉన్న సినిమాలు సేఫ్ గా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజైపోయాయి. బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమాలు వేడెక్కించాయన్న టాక్ వినిపించింది. అయితే వాటికి సెన్సార్ పరమైన చిక్కులు లేకపోయినా తన విషయంలోనే ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ షకీలా చాలానే బాధ పడిపోతోంది. సెన్సార్ దిగి రాకపోతే షకీలాకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏదైనా ఓటీటీ వేదికకు సినిమాని అమ్ముకోవడమే. మరి ఆ పని చేస్తుందా? లేక పోరాడి థియేట్రికల్ రిలీజ్ చేస్తుందా? అన్నది చూడాలి. లేడీస్ నాట్ అలోవ్డ్ హారర్ విత్ అడల్ట్ మూవీ అన్న సంగతి తెలిసిందే.