Begin typing your search above and press return to search.
నా సినిమాల్లోనే ఉందా బూతు- షకీలా
By: Tupaki Desk | 31 Dec 2015 9:29 AM GMTషకీలా.. ఈ పేరు చెబితే అప్పట్లో కుర్రాళ్లే కాదు.. మలయాళ స్టార్ హీరోలు కూడా షేకైపోయేవారు. ఐతే కుర్రాళ్లు షేకైపోవడానికి కారణం వేరు. స్టార్ హీరోలు షేకవడానికి కారణం వేరు. షకీలా సినిమాల వల్ల తమ సినిమాల కలెక్షన్లకు గండి పడుతోందని.. ఆమె సినిమాల్ని నిషేధించాలని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద హీరోలు అప్పట్లో ప్రభుత్వాన్ని ఆశ్రయించడాన్ని బట్టి షకీలాకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఐతే అదంతా గతం. ఇప్పుడు షకీలా ఎవ్వరికీ పట్టని ఓ అనామకురాలు. సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుని ఓ అద్దె ఇంట్లో సాధారణ జీవితం గడుపుతోంది. మామూలు సినిమాల్లో కూడా అవకాశాలు తగ్గిపోయాక.. తన జీవిత కథ రాసి ప్రకంపనలు రేపిన షకీలా.. వీలు దొరికినపుడల్లా మీడియాతో మాట్లాడుతూ.. ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా ఆమె స్టార్ హీరోలపై ధ్వజమెత్తింది. తన సినిమాల మీద బూతు ముద్ర వేసి నిషేధించడానికి ప్రయత్నించిన స్టార్ హీరోలు.. తమ సినిమాల్లో బూతును ఎందుకు పట్టించుకోరని ఆమె ప్రశ్నించింది. వాళ్ల సినిమాల్లో కూడా గ్లామర్ పాళ్లు బాగానే ఉన్నప్పటికీ తన సినిమాలనే అశ్లీల చిత్రాలుగా చూపించారని.. మలయాళ సినీ పరిశ్రమలో అసలు స్త్రీలకు సరైన గౌరవమే లేదని.. అది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని విమర్శలు గుప్పించింది షకీలా. ఐతే సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ తరం హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తున్నారని.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగకపోయినా ఉన్నంతలో మంచి పేరు, డబ్బు సంపాదించుకుని, తర్వాత కుటుంబంతో సెటిలైపోతున్నారని షకీలా చెప్పింది. ఐతే తాను మాత్రం వ్యక్తిగతంగా తన జీవితంలో ఎంతో నష్టపోయానని.. తన మేనేజర్ తో పాటు సొంతవాళ్లు కూడా డబ్బులు కాజేసి మోసం చేశారని షకీలా వాపోయింది.