Begin typing your search above and press return to search.
షకీలా ఇంటి అద్దె ఎంత?
By: Tupaki Desk | 1 Nov 2015 1:30 PM GMTషకీలా.. ఈ పేరు చెబితే షేకైపోయేవాళ్లు ఒకప్పుడు కుర్రాళ్లు. తన సినిమాలతో కుర్రకారుకు ఓ రకంగా.. మలయాళ సూపర్ స్టార్లకు మరో రకంగా వణుకు పుట్టించిన ఘనత షకీలాకే సాధ్యమైంది. ఐతే దశాబ్దం పాటు మలయాళ శృంగార చిత్రాలతో ఓ ఊపు ఊపిన షకీలా.. దాదాపు పదేళ్ల నుంచి ఆ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆ టైపు సినిమాలకు దూరమయ్యాక రెగ్యులర్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటున్న షకీలా.. మెగా ఫోన్ పట్టి సినిమాలు కూడా తీసింది.
తన ఆత్మకథతో కేరళ - తమిళ రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. ఆమె ఆత్మకథ త్వరలోనే తెలుగులోకి కూడా రాబోతోంది. ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించిన తాను.. ఇప్పుడు మామూలు మధ్యతరగతి జీవితం గడుపతున్నానని.. దాదాపుగా ఎవరూ లేని ఒంటరిని అయిపోయానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షకీలా ఏమంటోందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ప్రస్తుతం చెన్నైలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నా. ఆ ఇంటి అద్దె రూ.11 వేలు. ఎంత సంపాదించినా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయా. కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చడానికే నా సంపాదన అంతా ఖర్చు చేశా. నాన్న చనిపోయాడు. అమ్మ, అక్క నాకు దూరంగా ఉంటున్నారు. తమ్ముడికి పెళ్లి చేశా. ఆ తర్వాత అతనూ దూరమైపోయాడు. నా దగ్గ అసిస్టెంట్ గా పని చేసినా కుర్రాడే నాక తోడు. అతను అమ్మాయిగా మారాడు. తననే ఇప్పుడు నా కూతురిగా భావిస్తున్నా. తమిళంలో, కన్నడలో అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగు వాళ్లే నన్ను పట్టించుకోవడం లేదు. తేజ మంచి అవకాశాలు ఇచ్చాడు. ఆయనతో కేక సినిమా చేస్తున్నపుడు ఆత్మకథ రాయమని సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సలహా ఇచ్చారు. తర్వాత ఆత్మకథ రాశా. అది మలయాళంలో, తమిళంలో మంచి ఆదరణ పొందింది. త్వరలోనే దాన్ని తెలుగులోకి తీసుకొస్తా’’ అని చెప్పింది షకీలా.