Begin typing your search above and press return to search.
ఇంట్లో వాళ్ల కడుపు నింపాలనే ఆ సినిమాలు చేశా!
By: Tupaki Desk | 25 March 2018 5:30 PM GMTఎంతో మంది నటీమణులు ఉన్నారు. కానీ.. షకీలా మాత్రం ఒక్కతే. ఆ మాటకు వస్తే.. ఎవరికి వారిగా చూసినప్పడు ఒక్కరిగానే కనిపిస్తారు. కానీ.. షకీలా ఇమేజ్ వేరు. ఆమె వేరు. అందరూ అందంగా కనిపించాలనుకుంటారు. బ్యూటీగా మార్కులు వేయించుకోవాలనుకుంటారు. కానీ.. వ్యాంప్ గా.. శృంగార తారగా ముద్ర వేయించుకోవాలని అనుకోరు. అందరి సంగతేమో కానీ.. శృంగారతార అన్నంతనే గుర్తుకు వచ్చే షకీలకు ఆ మార్క్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.
కానీ.. ఆ తరహా సినిమాలే దాదాపుగా 250 వరకు చేసింది. మలయాళ అగ్రహీరోలకు సైతం చురుకు పుట్టేలా.. ఆమె మీద కన్నెర్ర చేసేలా చేశారు. ఎందుకంటే.. షకీలా సినిమా రిలీజ్ అయితే.. అగ్రహీరోల సినిమాల కలెక్షన్లు సైతం డల్ అయిపోయేవి.
అయితే.. సమజాన్ని చెడగొట్టే పాడు సినిమాలు ఎందుకు చేశావ్? అన్న మాట అడిగితే.. నిజాయితీగా సమాధానం చెప్పేస్తుంది. తెరపైన షకీలాను చూస్తే కలిగే వెకిలి భావన.. ఆమెను కలిసి మాట్లాడినప్పుడు మాత్రం అస్సలు అనిపించదు. అంతకు మించి గౌరవం కలుగుతుంది. ఆమె కష్టాల్ని చూసైనా మంచి అవకాశాలు దేవుడు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకోవటం కొందరు చేస్తారు. తన కోసం.. తన పేరు కోసం కాకుండా.. తన కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగేందుకు ఏ మాత్రం వెనుకాడని షకీలా ఉదంతం ఆమెపై గౌరవాన్ని రెట్టింపు అయ్యేలా చేస్తుంది.
షకీలా సినిమాల కారణంగా యువత చెడిపోతుందన్న మాట ఉంది కదా? మీ వరకు మీకు ఇలాంటి పాడు సినిమాలు చేయటం ఏమిటని ఎందుకు అనిపించలేదు? సినిమాల్లో మీరు పోషించిన పాత్రలు మీకు కరెక్ట్ గా అనిపిస్తున్నాయా? అంటూ ప్రశ్నలు వేస్తే.. షకీలా చెప్పే సమాధానం ఊహించనిరీతిలో ఉంటుంది. విన్నత తర్వాత అయ్యో అనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే చూస్తే..
"సెక్స్ సినిమాలు చేసిన మొదటి ఆర్టిస్ట్ ను నేను కాదు. సెక్స్ అన్నది ఎవరు మొదలు పెట్టారు? షకీలాతో మొదలైందా? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది కదండి. గ్లామర్ సినిమాలు నాతోనే మొదలయ్యాయా? నా కంటే ముందు లేవా? చిన్నప్పుడు నేను కూడా అలాంటి సినిమాలు చూశాను. ఇంటర్నెట్ వచ్చాక..కొన్నిచోట్ల ఎక్స్ ట్రా డబ్బులు తీసుకొని అలాంటి సినిమాలు చూపించలేదా?"
"ఒకసారి నా తమ్ముడు ఇలాంటి సినిమాలు చూశాడని తెలిసి తన్నా. నేనేం ఓపెన్ గా చూపించలేదు..? న్యూడ్ గా కనిపించలేదు? నేను మెసేజ్ ఇచ్చానని చెప్పి ఎవరినైనా మోసం చేశానా? యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను యువతను చెడగొట్టానని ఎలా అనగలరు? నేను నా కోసం చేసుకున్నా. నా ఖర్మ ఏమిటంటే.. నాకన్నీ అలాంటి సినిమాలే ఇచ్చారు. నాకు సినిమాకు లక్ష రూపాయిలు ఇస్తుంటే.. మా అమ్మ.. నాన్నల కోసం స్వార్థంగా ఆలోచించాను. అంతే తప్పితే.. సమాజం గురించి ఆలోచించేపరిస్థితుల్లో లేను. నా కడుపు నింపుకొని.. నా కుటుంబం కడుపు నింపాలనే అనుకున్నాను తప్పించి మరింకేమీ ఆలోచన లేదు" అని వెల్లడించింది.