Begin typing your search above and press return to search.
ఆసుపత్రి నుండి షకీలా వీడియో మెసేజ్
By: Tupaki Desk | 21 July 2020 1:10 PM GMTసౌత్ లో బిగ్రేడ్ చిత్రాలకు పెట్టింది పేరైన షకీలా గత కొంత కాలంగా ఆర్థికంగా ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొటుంది. మూడు సంవత్సరాల క్రితం లేడీస్ నాట్ అలౌడ్ అనే అడల్ట్ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమా కోసం తన ఆస్తులను అమ్మడంతో పాటు అప్పులు తీసుకు వచ్చినట్లుగా ఆమె చెప్పింది. మగాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాలంటూ తెగ ప్రచారం చేసి సెన్సార్ కు వెళ్లింది. అయితే సినిమాకు సెన్సార్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం చెప్పలేదు.
దాదాపు రెండు సంవత్సరాల పాటు సెన్సార్ కోసం షకీలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలోనే కరోనా కారణంగా సినిమా మరింత లేట్ అయ్యింది. షూటింగ్‌కు మూడు నెలలే పట్టినా విడుదలకు మాత్రం ఏకంగా మూడు సంవత్సరాలు పట్టింది. అయినా థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మట్ లో పే ఫర్ వ్యూ పద్దతిన విడుదల చేసింది. ఈ చిత్రంను చూసి నన్ను బతికించండి అంటూ కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన షకీలా తాజాగా మరో వీడియో సందేశాన్ని పంపించింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న తాను సినిమా ప్రమోషన్ కోసం రాలేక పోయాను. కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల నేను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మీరు అంతా సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను అంటూ విజ్ఞప్తి చేసింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.