Begin typing your search above and press return to search.
సంచలన విషయాలు వెల్లడించిన షకీలా
By: Tupaki Desk | 18 July 2017 8:43 AM GMTఓ దశాబ్దం పాటు మలయాళం బి-గ్రేడ్ సినిమాలతో షకీలా రేపిన సంచలనాలు అలాంటిలాంటివి కావు. ఆమె దెబ్బకు మలయాళం సూపర్ స్టార్లే బెంబేలెత్తిపోయి తన సినిమాల్ని అడ్డుకునే దాకా పరిస్థితి వచ్చింది. ఐతే షకీలాకు ఆ టైపు సినిమాల్లో డిమాండ్ ఉన్నంతవరకే ఆమె వైభవం సాగింది. తర్వాత ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కుటుంబ సభ్యుల కోసం సంపాదించిందంతా దారబోసి చివరికి తాను ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితికి వచ్చినట్లు షకీలా ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా షకీలాకు పెళ్లి కూడా కాలేదు. ఆమెకంటూ ఎవరూ తోడు కూడా లేరు. ఐతే తన జీవితంలో 20 ప్రేమకథలు ఉన్నట్లు షకీలా వెల్లడించడం విశేషం. కానీ ఆ 20 మంది ప్రేమికుల్లో ఎవరూ తనతో లేకుండా పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాను చాలా త్వరగా ప్రేమలో పడిపోతానని.. ఎవరైనా నచ్చితే వాళ్లతో వెంటనే ప్రేమలోకి దిగిపోయేదాన్నని.. అలా అన్నింటినీ లెక్క పెడితే తన జీవితంలో 20 ప్రేమకథలు ఉన్నాయని షకీలా ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఐతే రకరకాల కారణాల వల్ల తన ప్రేమకథలు చాలా త్వరగా ముగిసిపోయేవని షకీలా వెల్లడించింది. కొందరు తన తల్లిని దూరంగా పెట్టమన్నారని.. ఇంకొందరు తన అన్నయ్యకు ఆర్థిక సాయం చేయొద్దన్నారని.. కొందరు తనపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేశారని.. ఇలా రకరకాల కారణాలతో ఒక్కొక్కరిని వదులుకోవాల్సి వచ్చిందని షకీలా వెల్లడించింది. చివరగా ఓ వ్యక్తితో ఏడేళ్లు కలిసున్నానని.. తన సినీ జీవితాన్ని కారణంగా చూపి ఆమె తల్లి తనను వ్యతిరేకించిందని.. దీంతో అతను కూడా తనకు దూరమయ్యాడని షకీలా చెప్పింది. తన ప్రేమికుల్లో కొందరు తనను బాగా కొట్టేవారని.. ఒక వ్యక్తి తనను తీవ్రంగా హింసించాడని తెలిపింది. ఐతే అతడిపై ఓసారి తిరగబడి హ్యాంగర్ తీసి చితకబాది ట్యాక్సీలో తన ఇంటికి పంపించానని షకీలా వెల్లడించడం విశేషం. ఇప్పుడు తాను ఒంటరిదాన్నని షకీలా ఆవేదనగా చెప్పింది.