Begin typing your search above and press return to search.

కూతురు ప్రేమపై స్పందించిన స్టార్ నటుడు

By:  Tupaki Desk   |   2 Sep 2021 1:30 AM GMT
కూతురు ప్రేమపై స్పందించిన స్టార్ నటుడు
X
బాలీవుడ్ లో స్టార్‌ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా సొంత ప్రతిభతో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌. ఈ అమ్మడు తెలుగులో సాహో సినిమాలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ యంగ్‌ హాట్ బ్యూటీ ఈమె. గత కొన్నాళ్లుగా ఈమె బాలీవుడ్‌ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌ రోహన్ శ్రేష్ట తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌ లో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఇరు కుటుంబాలు కూడా ప్రస్తుతం సన్నిహితంగా ఉంటున్న కారణంగా వీరి ప్రేమకు ఓకే చెప్పినట్లుగానే అంతా భావిస్తున్నారు.

తాజాగా శ్రద్దా కపూర్‌ తండ్రి ప్రముఖ స్టార్‌ నటుడు శక్తి కపూర్‌ తన కూతురు ప్రేమ విషయమై స్పందించాడు. తన కూతురు ప్రేమ విషయమై ఆయన స్పందించాడు. తన కూతురు ప్రేమను గౌరవిస్తున్నట్లుగా.. ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగానే స్పందించాడు. చాలా కాలంగా రోహన్‌ శ్రేష్ట తండ్రితో తనకు సన్నిహిత్యం ఉందని వారి ఫ్యామిలీ చాలా కాలంగా తమకు సన్నిహితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇప్పటి వరకు రోహన్‌ శ్రేష్ట తన కూతురు ను పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ చేయలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

శక్తి కపూర్‌ రెండు ఫ్యామిలీస్ సన్నిహితంగా ఉంటున్నాయి.. తన కూతురు అభిప్రాయంను గౌరవిస్తాను అంటూనే ఇప్పటి వరకు వారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేదు. ఇద్దరు మంచి స్నేహితులు అన్నట్లుగానే చెప్పడంతో అసలు విషయం ఏంటా అంటూ బాలీవుడ్‌ మీడియా వారిద్దరిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా పబ్‌ లు క్లబ్‌ లు అంటూ తిరుగుతున్నారు. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా పార్టీల్లో కనిపిస్తున్నారు. అంత క్లోజ్ గా ఉన్న వారు ప్రేమలో లేరు అంటే ఎవరు నమ్ముతారు శక్తి కపూర్ గారు అంటూ కొందరు ఆయన వ్యాఖ్యలకు కామెంట్స్ చేస్తున్నారు.