Begin typing your search above and press return to search.

రెండు దెబ్బలకి శ్రద్ధ పెట్టక తప్పలే

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:38 AM GMT
రెండు దెబ్బలకి శ్రద్ధ పెట్టక తప్పలే
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కి గతేడాది చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. అరంగేట్రం నుంచి వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న ఈ బ్యూటీకి.. 2016 పెద్ద షాక్ నే ఇచ్చింది. రాక్ ఆన్2.. ఓకే జాను అంటూ రెండు డిజాస్టర్లు అమ్మడి ఖాతాలో పడ్డాయి.

రెండూ క్రేజీ ప్రాజెక్టులే అయినా.. వాటిని పిక్చరైజ్ చేసిన విధానాల్లో తేడా కొట్టేయడంతోనే ఈ సినిమాలు బోల్తా కొట్టేశాయి. ఈ రెండు డిజాస్టర్ల కారణంగా శ్రద్ధా కపూర్ ఇప్పుడు కెరీర్ పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. తన మేనేజర్స్ టీంని మార్చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. కొత్త పీఆర్ ఏజన్సీతో చర్చలు కూడా జరిగిపోతున్నాయట. ఆమె తండ్రి సీనియర్ యాక్టర్ శక్తి కపూర్.. కీలకమైన కొన్నిసార్లు మాత్రమే కూతురు కెరీర్ విషయంలో తలదూరుస్తారు. ఇప్పుడు పీఆర్ ఏజన్సీ విషయంలో శక్తి కపూర్ కూడా యాక్టివ్ గా ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు అర్జున్ కపూర్ తో శ్రద్ధా కపూర్ నటిస్తున్న మూవీ హాఫ్ గాళ్ ఫ్రెండ్.. ఈ సమ్మర్ లో రిలీజ్ కానుంది. బేస్ బాల్ ప్లేయర్ గా అర్జున్ కపూర్ నటిస్తుండగా.. అతని ప్రియురాలిగా హాఫ్ గాళ్ ఫ్రెండ్ లో శ్రద్ధ నటన ఆకట్టుకుంటుందనే టాక్ ఉంది. ఈ మూవీ హిట్ అయితే.. అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే. చేతన్ భగత్ నవల ఆధారంగా తెరకెక్కుతుండంతో.. ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/