Begin typing your search above and press return to search.
ప్రేమికులకు ఎప్పటికి గుర్తుండిపోయే వార్నింగ్
By: Tupaki Desk | 14 Feb 2023 2:00 PM GMTఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజును చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమలో పేడ వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎలాంటి గిఫ్టులు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందనే వాటిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
తమను ప్రేమించే వారికి, తాము ప్రేమించే వారికి పంపేందుకు అనేక డైలాగులు, కొటేషన్లు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ శుకుంతల డైలాగ్ కూడా ఈరోజు వైరల్ గా మారింది.
అయితే ఉదయ్ కిరణ్, అనితలు హీరోహీరోయిన్లుగా 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంలో శకుంతల కట్టే డైలాగ్ ఇది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు అంతా ప్రేమ గురించే మాట్లాడుతుండడంతో.. ఈ డైలాగ్ వేసి విపరీతమైన మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ డైలాగ్ ను అందరికీ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ డైలాగ్ లో శకుంతల.. ఏమంటుందో మనం ఇప్పుడు చూద్దాం.
"ఇయ్యాల రేపు ఎవర్ని చూసినా ప్రేమా.. ఇదో సోకైపోయింది. ఏందే ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలేం, మేమంతా పెరుగుతలేం. ఇంకోపారి నా ఇలాకలో ఏ పోరి నోట్ల కానీ, ఏ పోరడి నోట్ల గానీ పేమ అనే మాట నాకినబడాలే.. గొడ్డలి తీసుకొని తుక్డాలు తుక్డాల కింద నరుకుత దీం తల్లి." అనే డైలాగ్ వైరల్ గా మారింది. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎక్కడా చూసిన ఈ డైలాగ్ యే వినిపిస్తోంది. 2001లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
అంతే కాదండోయ్ కోటిన్నరతో సినిమా తెరకెక్కిస్తే 20 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టి ట్రెండ్ ను సెట్ చేసింది. శుకుంతల డైలాగ్ మాత్రమే కాకుండా... మీ పెద్దోళ్లున్నారే అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. దాదాపు 70 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ ఛాయాగ్రహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలను దక్కించుకుంది. అ తర్వాత పలు భఆషల్లోకి డబ్ అిన సినిమా అక్కడ కూడా భారగానే వసూళ్లు సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.