Begin typing your search above and press return to search.
ఫోటో టాక్ : అయ్యో బేబీ నడుము నల్లపూస కంటే దారుణం
By: Tupaki Desk | 10 March 2022 12:30 AM GMTఅర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ను యంగ్ సూపర్ స్టార్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. అంతటి గుర్తింపును దక్కించుకున్న విజయ్ దేవరకొండకు జోడీగా షాలిని పాండే నటించిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ ఆ స్థాయిలో సక్సెస్ అయ్యి ఆఫర్లు దక్కించుకుంటూ ఉంటే షాలిని పాండే మాత్రం ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.
షాలిని పాండే ఆఫర్ల కోసం వెతుక్కుంటున్న సమయంలో అనూహ్యంగా బరువు పెరిగి పోయింది. బరువు పెరిగినా కూడా బొద్దు గుమ్మ ముద్దుగా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. కాని ఆఫర్లు మాత్రం రాలేదు. దాంతో బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు ఈమద్య కాలంలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే మరీ ఇంత అరాచకంగా బరువు తగ్గారేంటి అనిపిస్తుంది. ఇంతగా బరువు తగ్గాల్సింది కాదు మేడం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మరీ దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోలో ఈమె నడుము అసలు నల్లపూస కంటే దారుణం అన్నట్లుగా ఉంది. అస్సలు కనిపించక పోవడంతో పాటు మరీ ఇంతగా సన్నబడితే జనాలకు కంటికి ఆనరు మేడం అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం షాలిని న్యూలుక్ కు జీరో సైజ్ కు ఫిదా అవుతూ లవ్ ఈమోజీలు కామెంట్ లో షేర్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈమెకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రాలేదు. దాంతో వచ్చిన అవకాశాలను చేస్తూ వెళ్లింది. ఆ సినిమా లు నిరాశ పర్చడంతో ఆఫర్లు సన్నగిల్లాయి. కాని ఈసారి అలా చేయకుండా జగ్రత్త పడుతోంది. ఈసారి వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్క సినిమా ఛాన్స్ ను వినియోగించుకోవాలని భావిస్తోంది. అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటూ స్కిన్ షో కు సిద్దం అయ్యింది.
అందాల విందు తో ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో ఆఫర్లు కోరుతోంది. ఇంతటి సన్నటి అందంను ఎవరైనా కావాలనుకుంటారు. కనుక యంగ్ హీరోలకు ఖచ్చితంగా ఈమె వాంటెడ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని పెద్ద చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.