Begin typing your search above and press return to search.
అన్ని ముద్దులు ఎలానో చెప్పేసింది
By: Tupaki Desk | 3 Dec 2017 4:16 AM GMTసినిమాలో ముద్దు సీన్ జమానా నుంచి ఉన్నదే. ముద్దు సీన్ రాగానే హీరో.. హీరోయిన్లు చెట్టు వెనక్కి వెళ్లిపోయే దశ నుంచి. పెదవి.. పెదవి ఘాటుగా లంకె వేసుకునే వరకూ తెలుగు సినిమా వచ్చేసింది. హీరోయిన్ గ్లామర్ పాళ్లు మోతాదు మించినా చర్చకు రాదు కానీ.. బికినీ.. లిప్ లాకింగ్ చేస్తే మాత్రం అదో చర్చగా మారుతుంది. సినిమాలో ఒక్క ముద్దు సీన్‌కే ఇంత జరిగితే.. ఘాటు అధర చుంబనాలతో వేడెక్కిపోయేలా చేసిన అర్జున్ రెడ్డి మూవీ ఓ సన్సేషన్.
ఈ సినిమాలోహీరో హీరోయిన్ల లిప్ లాకింగ్ సీన్లు ఎంతో సంచలనంగా మారాయి. ముద్దును ఒక ఎమోషన్‌గా పండించటంలో విజయ్ దేవరకొండ కానీ.. షాలినీ కానీ కనిపించకుండా సినిమాల్లో పాత్రలు మాత్రమే కనిపించటం ఒక స్పెషాలిటీ. మరి.. అన్నేసి ముద్దులు ఎలా సాధ్యమయ్యాయి? ఇబ్బంది పడలేదా? మొదటి సినిమాలోనే ఇలా ఒప్పేసుకుంటే తక్కువైపోతారనుకోలేదా? లాంటి చాలా డౌట్లను ముందు పెడితే.. ముద్దుగుమ్మ మనోహరంగా నవ్వేస్తూ.. చాలానే విషయాల్ని చెప్పుకొచ్చింది.
సినిమా చేసేటప్పుడు ఏం చేసినా ఫ్యాషన్ తో చేయాల్సిందేనని తాను నమ్ముతానని..ముద్దు కూడా అందులో భాగమేనని చెప్పింది. కథ డిమాండ్ చేసింది కాబట్టి తాను చేశానే తప్పించి మరింకేమీ కాదుగా అంటూ గడుసుగా బదులిస్తూనే.. సినిమాలో ముద్దుసీన్లు చూస్తే.. షాలిని విజయ్ దేవరకొండను ముద్దుపెట్టుకోలేదు. ప్రీతి అర్జున్ రెడ్డిని ముద్దు పెట్టుకుందంటూ బదులిచ్చేసింది.
తాను థియేటర్ ఆర్టిస్ట్ నని.. ఆ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో తొలిసినిమాలోనే అన్నేసి ముద్దులు ఇబ్బంది కలగలేదని చెప్పింది. థియేటర్ ఆర్టిస్ట్ గా నాకు నేర్పిందేమంటే.. ఏ పాత్ర చేస్తున్నావో అక్కడ నువ్వు కాదు.. నీ క్యారెక్టర్ మాత్రమేనని మనసులో బలంగా అనుకోవాలన్న మాట మనసులో బలంగా నాటుకుపోయిందని.. షాలినిగా తాను ముద్దులుపెట్టలేదు కదా అని చెప్పింది.
అర్జున్ రెడ్డి మూవీలో నటిగా చాలా ప్యాషన్ తో ముద్దు సీన్స్ చేసినట్లుగా వెల్లడించింది. కెమేరా తనకు కొత్త అని ప్రేక్షకులు అనుకుంటారు కానీ తనకు మాత్రం పాత విషయమేనని చెప్పిన షాలిని.. కొన్ని నాటకాల్లో నటించిన సమయంలో కెమేరాలో షూట్ చేశారని.. అందుకే తనకేం ఇబ్బంది అనిపించలేదని చెప్పింది. కిస్సింగ్ అనేది ఒక ఎమోషన్ అని సందీప్ చెప్పారని.. అది ఏడుపులానే ముద్దు కూడా ఎమోషనే కాబట్టి ముద్దు పెట్టుకోవటం ఇబ్బంది ఎందుకనిపిస్తుందంటూ ప్రశ్నిస్తోంది. కథ డిమాండ్ చేస్తే.. దేనికైనా రెఢీ అన్న మాటను చెప్పటమే కాదు.. చేసే పనిని ప్యాషన్‌గా చేస్తానంటూ కమిట్ మెంట్ ఇచ్చేస్తోంది. దర్శక నిర్మాతలకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి?