Begin typing your search above and press return to search.

షాలిని పూల్ సైడ్ ట్రీట్ అగ్గి రాజేస్తోందిగా..!

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:48 PM GMT
షాలిని పూల్ సైడ్ ట్రీట్ అగ్గి రాజేస్తోందిగా..!
X
షాలిని పాండే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి గాళ్ గా పాపుల‌రైన ఈ బ్యూటీ మ‌హాన‌టి చిత్రంలోనూ క్యూట్ అండ్ ల‌వ్ లీ రోల్ లో గొప్ప న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. సింపుల్ క్యాచీ లుక్స్ తో ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే షాలినికి అన్నిచోట్లా చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది.

ఇక బాలీవుడ్ బిగ్ డ్రీమ్స్ తో ఈ బ్యూటీ చేసిన ప్ర‌యోగాల గురించి తెలిసిందే. హిందీ అగ్ర హీరో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న జ‌యేష్ భాయ్ జోర్ధార్ లో న‌టించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ప్ర‌స్తుతం హిందీ చిత్రం `మహారాజా`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. తిరిగి సౌత్ లో త‌న క‌మ్యూనికేష‌న్ ని మ‌రింత ధృఢం చేస్తోంద‌ని స‌మాచారం. ద‌క్షిణాదినా ప‌లు చిత్రాల‌కు క‌మిటైంది.. కానీ వాటి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

మ‌రోవైపు షాలిని ఇన్ స్టా మాధ్య‌మంగా వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. ఇటీవ‌ల మాల్దీవుల వెకేష‌న్ నుంచి వ‌రుస బికినీ ఫోటోలతో మ‌తులు చెడ‌గొట్టింది.

కొంత‌ స్లిమ్ లుక్ కి మారాక ఈ న‌వ‌నాయిక‌ మ‌రింత‌గా చెల‌రేగిపోతోంది. తాజాగా షాలిని పూల్ సైడ్ ట్రీట్ వెబ్ లో దుమారం రేపుతోంది. బ్లూ బికినీలో .. గ్రీన్ టాప్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో షాలిని మ‌తులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వెబ్ లో వైర‌ల్ గా మారాయి. షాలిని క్యూట్ అండ్ హాట్ అంటూ అభిమానులు వీటికి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.