Begin typing your search above and press return to search.

రెడ్డి హీరోయిన్.. ఛార్మిలా ఉందే

By:  Tupaki Desk   |   18 Dec 2017 10:20 PM IST
రెడ్డి హీరోయిన్.. ఛార్మిలా ఉందే
X
చాలామంది కొత్త హీరోయిన్లు.. ఫోటో షూట్లతోనే పడగొట్టేస్తున్నారు. ఒకవేళ ఛాన్సులు ఏమన్నా తగ్గితే మాత్రం వెంటనే సీరత్ కపూర్ తరహాలో ఒక బికినీ షూట్ ఏదో ఒకటి చేసేసి.. వెంటనే పాపులర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమా హీరోయిన్ షాలిని పాండే ఫోటో షూట్లను చేయట్లేదు కాని.. ఆమె గ్లామరస్ లుక్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.

షాలినీ పాండే తన తొలి తెలుగు సినిమాలో పెదాల ముద్దులతో అలరించేసినా కూడా.. ఆ తరువాత సినిమాల్లో గ్లామరసం మాత్రం చిందించను అని చెప్పేసింది. ఆ సంగతేమో కాని.. అమ్మడు గత రాత్రి జరిగిన జీ తెలుగు అవార్డ్స్ కార్యక్రమంలో మాత్రం తన హొయలతో మురిపించింది. అక్కడు ఒక ప్రతే్యకమైన డిజైనర్ డ్రస్సులో విచ్చేసి అమ్మడు తన సొగసులతో మెరుపులు మెరిపించింది. కాని ఇలా ఆమెను హాటు హాటు లుక్స్ లో చూస్తుంటే మాత్రం.. అమ్మడు అచ్చం ఛార్మిలా ఉందే అంటున్నారు కొందరు. జూనియర్ ఛార్మి అంటూ ఈమెకు ఫిదా అయిపోతున్నారు కూడాను.

ఏదేమైనా కూడా తమిళంలో ఆల్రెడీ రెండు సినిమాలను చేస్తున్న ఈ కుర్ర బ్యూటి.. తెలుగులో మాత్రం మహానటి సినిమాలో ఒక చిన్న పాత్రను చేస్తోంది. ఇంకా తెలుగులో ఆమెకు ఎవరూ సరైన సినిమాను ఆఫర్ చేయలేదట. అందుకే ఈ గ్లామర్ వలకపోత కాస్త ఎక్కువైందని అనుకోవాలా?