Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి పిల్ల.. ఈ రేంజ్ లో రెచ్చిపోతే....!

By:  Tupaki Desk   |   15 Feb 2023 5:00 AM GMT
అర్జున్ రెడ్డి పిల్ల.. ఈ రేంజ్ లో రెచ్చిపోతే....!
X
అర్జున్ రెడ్డి సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన షాలినీ పాండే గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి ప్రేయసిగా అదిరిపోయే పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తనకు సంబంధించిన విషయాలతో పాటు తన సినీ అప్ డేట్ల గురించి అభిమానులకు తెలియజేస్తుంటుంది. అంతే కాదండోయ్ హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదలుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. మొదటి సినిమాలో కాస్త క్యూట్ గా కనిపించిన ఈ బ్యూటీ చాలా హాట్ గా తయారవుతోంది.

ఇన్ స్టా వేదికగా షాలినీ పాండే తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఆమె బేబీ పింక్ డ్రెస్ లో మెరిసిపోతోంది. క్లీవేజ్ కనిపించేలా ఉన్న ఆ డ్రెస్సులో యువతకు పిచ్చెక్కేలా ఫోజులు ఇస్తోంది. ఎద ఎత్తు పల్లాలతో పాటు నడుము ఒంపుసొంపులు కనిపించేలా వయ్యారంగా కూర్చుంది.

మత్తెక్కించేలా చూస్తూనే మాయ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నావని కొందరు.. ఎద అందాలు చూపించేందుకు ఆ డ్రెస్ వేసుకున్నావని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

1.9 మిలియన్ల ఫాలోవర్లు కల్గి ఈ 30 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటి వరకు 223 పోస్టులు పెట్టింది. ఎప్పుడూ బికినీ, జీన్స్, లోనెక్ డ్రెస్సులు, ట్రెండీ వేర్లలో హాట్ గా కనిపించేలా షో చేస్తుంది. నెట్టింట గ్లామర్ షో చేస్తూ.. రచ్చ చేస్తుంటుంది.

అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియా ద్వారా అభిమానలకు చాలా దగ్గరగా ఉంటోంది. అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్లే ఆమెకు ఎక్కువగా అవకాశాలు అందుకోలేక పోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆమెకు తెలుగు రాకపోయినా చాలా కష్టపడి అర్జున్ రెడ్డి సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంది..

ఆ తర్వాత 100 పర్సెంట్ కాదల్, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్సబ్దం, వంటి చిత్రాల్లో సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ ఏ ఒక్క సినిమా ద్వారా కూడా ఆమె పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కేవలం తెలుగులోనే కాకుండా షాలిని పాండే హిందీతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. పలు టీవీ షోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించిందీ ముద్దుగుమ్మ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.