Begin typing your search above and press return to search.

అర్జున్ బేబీ సింగేసింది చూశారా

By:  Tupaki Desk   |   15 Feb 2018 4:57 PM IST
అర్జున్ బేబీ సింగేసింది చూశారా
X
అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండేని ఎవరైనా ఆ సినిమాను చూడక ముందే చూసి ఉంటే.. అసలు ఇంత అమాయకపు పిల్ల హీరోయిన్ అవుతుందా అని ఎవరు కలలో కూడా అనుకోని ఉండరేమో. ముఖ్యంగా రొమాన్స్ చేసే పాత్రలకు అస్సలు ఒకే చెప్పదేమో అని అనుకోకుండా ఉండలేరు. కానీ షాలిని పాండే మొదటి సినిమాలోనే లిప్ లాక్ లకు ఒకే చెప్పేసింది. సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే రొమాన్స్ చేసిన ఈ పిల్ల ఇండస్ట్రీలో ఎక్కువ కాలమే ఉంటుంది అనేలా టాక్ ను సొంతం చేసుకుంది.

ఇకపోతే సినిమాలే కాకుండా అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా ఒక ప్రయివేట్ సాంగ్ లో అమ్మడు చాలా వరకు మెప్పించింది. అర్జున్ రెడ్డిలో బేబీ అంటూ ఎంతో కిక్ ఇచ్చిన షాలిని సాంగ్ లో 'ఎలా నిలిచా..' అంటూ రాగాన్ని అందుకుంది. ఒక ప్రొఫెషినల్ సింగర్ పాడినట్లుగానే పడటమే కాకుండా పాటకు తగ్గట్టుగా హావభావాలను చూపించింది. తేజష్ శంకర్ లగోరి కంపోజ్ చేసిన ఆ సాంగ్ చాలా బావుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫుల్ మెలొడిలో షాలిని తన కళ్లతోనే ప్రేమను చూపించిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా సాంగ్ ఫాస్ట్ బీట్ లోకి వెళ్ళినప్పుడు కూడా షాలిని ఎక్కడా తడబడకుండా పాడింది. చూస్తుంటే నిత్యా మీనన్ - శృతి హాసన్ లాగా సినిమాల్లో అమ్మడు పాడేస్తుందేమో మరి. ఇక ప్రస్తుతం షాలిని తెలుగులో సావిత్రి బయోపిక్ లో నటిస్తోంది. అలాగే తమిళ్ లో 100% కాదల్ సినిమాలో కూడా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి.ప్రకాష్ కుమార్ అందులో హీరోగా కనిపించనున్నాడు.