Begin typing your search above and press return to search.
20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమైన సూపర్ స్టార్ భార్య
By: Tupaki Desk | 13 Feb 2021 3:31 AM GMTతమిళ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న షాలిని 2001 తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. హీరో అజిత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. భర్త పాపతో ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతున్న షాలిని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. తాజాగా షాలిని రీ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున షాలిని రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో ఈమె కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొన్నాళ్లుగా ఈ వెబ్ సిరీస్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లో షాలిని పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వెబ్ సిరీస్ లో విక్రమ్.. జయం రవి.. ఐశ్వర్య రాయ్.. త్రిష.. కార్తీ ఇంకా పలువురు స్టార్స్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా 9 ఎపిసోడ్ లు ఉంటాయని అంటున్నారు. నవరసాలకు సంబంధించిన ఈ వెబ్ సిరీస్ కి 9 మంది దర్శకులు వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.