Begin typing your search above and press return to search.
కమిట్ మెంట్ ఇవ్వకపోతే ఛాన్సులుండవన్న నటి
By: Tupaki Desk | 16 Sep 2022 4:00 AM GMT"యే మేరీ లైఫ్ హై - బాల్ వీర్" వంటి షోలలో కనిపించిన టీవీ నటి షామా సికిందర్. తాను పరిశ్రమలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసారు షామా. తన నుండి లైంగిక ప్రయోజనాలను ఆశించే నిర్మాతలు 'తనతో స్నేహం' చేయాలనుకునే నిర్మాతలు తనకు ఎలా ప్రతిపాదించారో ఇటీవల వెల్లడించింది. తనకు అవకాశం కల్పించినందుకు ప్రతిఫలంగా తన నుంచి లైంగిక ఫేవర్ కావాలని ప్రేరేపించేవారని షామా తెలిపింది. బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవలి కాలంలో పరిశ్రమ ఎలా మారిపోయిందో కూడా వెల్లడించింది. .
షామా మాట్లాడుతూ-"పరిశ్రమ ఇటీవల చాలా మారిపోయింది. అయితే ఇది మంచి కోసం. నేడు యువ నిర్మాతలు చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. నటీనటులను గౌరవంగా చూస్తారు. పని కోసం సెక్స్ అనే భావన వారికి లేదు. గతంలో నిర్మాతలు నాతో స్నేహం చేయాలనుకుంటున్నారని చెప్పేవారు.
మనం కలిసి పని చేయకపోతే మనం స్నేహితులుగా ఎలా ఉండగలం అని నాకు అనిపించేది. పనికి ప్రతిగా సెక్స్ అడగడం అనేది ఇటీవలి కాలంలో చాలా తక్కువయిందని నేను భావిస్తున్నాను" అని అన్నారు.
ఈ నిర్మాతలలో కొందరు 'పరిశ్రమలో బాగా స్థిరపడిన పేర్లు' ఉన్నాయని షామా వెల్లడించారు. నా ఉద్దేశ్యం ప్రకారం.. అలా చేయడానికి మీరు భయంకరమైన చేతకాని తనంలో ఉండి ఉండాలి. సేంద్రీయ పద్ధతి(మగువ మెచ్చే పద్ధతి)లో మీరు స్త్రీ హృదయాన్ని గెలుచుకోగలరన్న విశ్వాసం మీకు లేదని ఈ వేధింపులు నిరూపిస్తున్నాయి'' అన్నారు ఆమె.
కాస్టింగ్ కౌచ్ అనేది బాలీవుడ్ కే పరిమితం కాదని ప్రతిచోటా ఇది ఉందని షామా తెలిపారు. బాలీవుడ్ ను మాత్రమే నిందించడం తప్పు. ఇది లైమ్ లైట్ లో ఉన్న పరిశ్రమ కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతోంది అని తన అభిప్రాయం చెప్పారు.
షామా తన చిరకాల ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ ని ఈ ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకుంది. ఈ జంట 2015లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహం గోవాలో స్నేహితులు .. కుటుంబ సభ్యుల సమక్షంలో సన్నిహితంగా జరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.