Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: త్రూత్ కోసం ఇలా..

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:01 AM GMT
ఫోటో స్టోరి: త్రూత్ కోసం ఇలా..
X
రంగుల ప్రపంచంలో ఉండే మాయ ఏమిటో గాని కొంత మంది బామలు ఇట్టే మారిపోతారు. గ్లామర్ గాలి కొంచెం తగిలినా పువ్వు లాగా అందంగా వికసించుకుపోతారు. అంతే కాకుండా వెరైటీ గ్లామర్ లుక్ తో ఎప్పుడు ప్రదర్శించని అందాలను మగాళ్ల ముందు ఉంచేస్తారు. దానికి తోడు సోషల్ మీడియా ప్రభావం బాగానే ఉంటుంది. కాస్త హాట్ గా కనిపించినా కూడా అందరికి నిమిషాల్లో కనెక్ట్ అవుతుంది.

ప్రస్తుత రోజుల్లో సినిమాల్లో కనిపించే నటీమణులే కాకుండా బికినిలో బుల్లితెర స్టార్స్ కూడా ఇరగదీస్తున్నారు. సీరియల్స్ లోట్రెడిషినల్ లుక్ తో కనిపించే భామలు బయట ప్రపంచంలో మాత్రం బికినీల్లో దర్శనం ఇస్తున్నారు. రీసెంట్ గా ఓ సీరియల్ బ్యూటీ కూడా బికినిలో కనిపించి అందరిని షాక్ కి గురి చేసింది. ఆమె ఎవరో కాదు షామా సికందర్. ఈ 38 ఏళ్ల బ్యూటీ కొన్నేళ్ల క్రితం సీరియల్స్ తో తెగ ఆకర్శించేది. సీఐడీ అనే సీరియల్ లో కూడా నటించింది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు అందరికి షాక్ ఇచ్చాయి. బీచ్ లో సేద తీరుతూ వయ్యారాలను సరికొత్తగా చూపించింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే అమ్మడు ఈ ఫోటోలను పెట్టింది మాత్రం తన కొత్త షార్ట్ ఫిలిం ఒకదాన్ని ప్రమోట్ చేసుకోవడానికే. 'ది త్రూత్' అంటూ సాగే ఈ ఫిలింలో.. వర్మ తన జిఎస్ టిలో బాగా రోత పుట్టించే గ్లామర్ ను చూపిస్తే.. అమ్మడు మాత్రం అంతలా రెచ్చిపోకుండా అదే పాయింట్ ను కాస్త సున్నితంగా చెప్పింది. అదే నిజమైన త్రూత్ అంట.