Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: మళ్ళీ బికినీ వేసిందిగా!
By: Tupaki Desk | 3 Aug 2019 6:30 AM GMTబాలీవుడ్లో హాటు భామలకు కొదవే ఉండదు. గలగలా పారే నదులన్నీ సముద్రం బాటపట్టినట్టుగా ఇండియా నలుమూలలా ఉండే ఘాటు అందాలన్నీ ముంబై బాట పడతాయి. ఇండియా ఏం ఖర్మ.. ప్రపంచం నలుమూలలా ఉండే అందాలనీ బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాయి. ఈ భామల దెబ్బకే సోషల్ మీడియాలో ఎల్ నినో ఎఫెక్ట్.. లా నినా ఎఫెక్ట్ వస్తున్నాయి. కానీ పర్యావరణ వేత్తలు గుర్తించడం లేదంతే. కళాపోషకులైన ఇన్స్టా తత్వవేత్తలు మాత్రం ఈ సామాజికమాధ్యమ వాతావరణ ఉత్పాతాలను ఎప్పుడో గుర్తించారు. అందుకే సోషల్ మీడియాలోవారు ఈ భామల ఫోటోలకు లైకులు కొడుతూ.. కామెంట్లు పెడుతూ వారికి తమదైన తోడ్పాటు అందిస్తున్నారు.
ఇంత మద్దతు అందిస్తే ఆ ఘాటు భామలు రెచ్చిపోకుండా ఉంటారా? రెచ్చిపోతారు. అలా రెచ్చిపోయి మరీ బికినీ ఫెస్టివల్స్ చేస్తున్న భామల్లో షమ సికందర్ ఒకరు. ఈ హాటు బ్యూటీ ఘాటు ఫోటోల గురించి ఇప్పటికి ఎన్నో సార్లు మనం చర్చించుకున్నాం. తాజాగా మరోసారి ఒక బికినీ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వరా పోస్ట్ చేసింది.. ఈ ఫోటోకు షమ "ఎవరైనా 'మేం చూసుకుంటాం' అని చెప్తారు. కానీ వారి చేతలను గుర్తించండి .. మాటలను కాదు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మన ఫ్రెండ్స్ లో.. బంధువుల్లో చాలామంది 'మేమున్నాం కదా మీకెందుకు మేం చూసుకుంటాం' అని మనతో తరచుగా అంటూ ఉంటారు.. కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రం వారు మన దగ్గర ఉండరు. సహాయం చెయ్యరు.. తీరిగ్గా యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. సరదాగా గడుపుతూ 'మేం బిజీగా ఉన్నాం' అని చెప్పి ఎంచక్కా తప్పించుకుంటారు. అందుకే వారి మాటలను పట్టించుకోవద్దు.. చేసే పనులు మాత్రమే గమనించండి అని తన ఫాలోయర్లకు చెప్తోంది. ఇంత పెద్ద ఫిలాసఫీని ఎంత తక్కువ మాటల్లో భలే చెప్పింది కదా?
ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీతో పాటుగా కత్తిలాంటి బికినీ ఫోటో కూడా పోస్ట్ చేయడం చూస్తే షమ ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ భామ టర్కీ దేశంలో హాలిడేలో ఉంది. అక్కడ అంత్యంత అందంగా కనిపించే ఒక బీచ్ లో తెల్లటి ఇసుకలో సూపర్ పోజులో కూర్చుంది. కాళ్ళను వెనుకకు మడిచి.. ఒక చేతిని ఇసుకపై ఆన్చి .. మరో చేతిని తలపై వయ్యారంగా పెట్టుకొని కూర్చుంది. ఎడమ చేతికి.. నాభి అందాలకు మధ్య నీటిపై ప్రతిబింబిస్తున్న సూర్యుడి కిరాణాలను బంధించింది. ఎన్నో రోగాలతో రొష్టులతో మానసిక వేదనలతో ముక్కి మూలుగుతున్న జనాలకు అందాన్ని.. ఆనందాన్ని పంచడానికి భూలోకానికి వచ్చిన స్వర్గలోకపు దేవతలా కనిపిస్తోంది. ఈ ఫోటోకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "హాట్ బ్యూటీ.. సన్ షైన్".. "సెక్సియెస్ట్ బికినీ".. "అన్ బీటబుల్ బికిని బేబ్" అంటూ మెచ్చుకున్నారు.