Begin typing your search above and press return to search.

రూ.599 స్విమ్ సూట్ తొడిగి అంత క‌ల‌రిస్తోంది?

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:30 AM GMT
రూ.599 స్విమ్ సూట్ తొడిగి అంత క‌ల‌రిస్తోంది?
X
బీచ్ క‌నిపిస్తే చాలు చెల‌రేగిపోవ‌డం కొంద‌రికి అల‌వాటు. ఈ బాప‌తుకే చెందుతుంది న‌టి కం గాయ‌ని షామా సికంద‌ర్. ఇటీవ‌లే షామా మాల్దీవుల విహారంలో స్విమ్ సూట్ల‌తో హీటెక్కించింది. ఇప్పుడు మ‌రో వెకేష‌న్ ని ఆస్వాధిస్తోంది. ఓవైపు న్యూయార్క్ వేకేష‌న్ లో ఝూమ్ జామ్ అంటూ బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి షికార్లు చేస్తున్న ఈ బ్యూటీ త‌న ఇన్ స్టా అభిమానుల్ని మ‌ర్చిపోకుండా త్రోబ్యాక్ బికినీ ఫోటోల‌ను షేర్ చేస్తూ ట్రీటిస్తోంది.

తాజాగా షామా షేర్ చేసిన నియాన్ మెరుపుల స్విమ్ సూట్ అగ్గి రాజేస్తోంది. షామా సికందర్ సమ్మర్ బీచ్ స్టైల్ కు అధునాతన హంగుల్ని జోడించింది. ఈ అందమైన ఫ్లోరోసెంట్ స్విమ్ సూట్ లో స్టైలిష్ గా క‌నిపిస్తోంది. అద్భుతమైన ఈ స్విమ్ సూట్ ఖ‌రీదెంతో తెలుసా..? జ‌స్ట్ రూ.599 మాత్ర‌మే. ఇంత‌కీ ఇది ఏ బీచ్ సొగ‌సు? అంటే.. ఫ్లోరిడాలోని బీచ్ లో ఇలా షామా సికందర్ వేసవి సెల‌వుల్ని ఆస్వాధించిందిట‌.

అది త్రోబ్యాక్ బికినీ .. కానీ ఇప్పుడు షామా రంగు రంగుల డిజైన‌ర్ దుస్తుల్లో ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. షామా సికందర్ న్యూయార్క్ లో ఆకర్షణీయమైన భంగిమల‌తో మ‌తి చెడ‌గొడుతోంది. త‌న‌కు కాబోయే భర్త జేమ్స్ మిల్లిరాన్ తో ప్ర‌స్తుతం విరామ స‌మ‌యాన్ని ఆస్వాధిస్తోంది ఈ బ్యూటీ.

మేము యుఎస్ లో ఉన్నాము. ముంబై న‌గ‌రంలో లాక్ డౌన్ ఆన్ లో ఉంది.. దీనివల్ల ప్ర‌యోజ‌నం లేదు కాబట్టి సెల‌వుల‌ కోసం నగరం నుండి బయటపడటానికి గొప్ప మార్గం ఇదేన‌ని భావించాం. జేమ్స్ కుటుంబాన్ని అతని ఇత‌ర బంధుమిత్రుల‌ను కలవడానికి ఇది మంచి సమయం. నేను ఇంతకు ముందు వారిని కలవలేదు. కాబట్టి ఇది సెలవుదినం కంటే కుటుంబానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్న‌మ‌ని షామా తెలిపింది. మేము టైమ్స్ స్క్వేర్.. ఫిఫ్త్ అవెన్యూకి వెళ్ళామని వెల్ల‌డించింది.