Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్:మనసు లాగేసేలా చేస్తున్న శమంతకమణి
By: Tupaki Desk | 30 Jun 2017 1:50 PM GMTకొన్ని సినిమాలంతే టీజర్ తోనే కనెక్ట్ అయిపోతుంటాయి. టీజర్ తో ఆగకుండా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేలా చేస్తాయి. అక్కడితో ఆగకుండా.. సినిమా రిలీజ్ ఎప్పుడయ్యేను? అని మనసు లాగేసేలా చేస్తాయి. ఇదంతా శమంతకమణి మూవీ గురించే. నారా రోహిత్ అన్న వెంటనే డిఫరెంట్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్ అన్న విషయాన్ని గుర్తు చేస్తుంటాయి. ఆ మాటకు మరింత నమ్మకాన్ని పెంచేలా కనిపిస్తోంది తాజా శమంతకమణి.
టీజర్ తోనే పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. నలుగురు హీరోలతో మల్టీస్టారర్ మూవీగా చేస్తున్న దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. భలే మంచి రోజు మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. తాజా శమంతకమణితో మరోసారి తన మేజిక్‌ను రిపీట్ చేయటం ఖాయమన్న భావన కలిగేలా చేస్తోంది.
రెండు నిమిషాలకు రెండు సెకన్ల నిడివి తక్కువగా ఉన్న ట్రైలర్‌ను చూస్తేనే ఇదో క్రైమ్ థిల్లర్ మూవీలా అనిపిస్తుంది. అయితే.. ఈ జానర్ లో ఉండే లోపం ఏమిటంటే.. సరైన టైమింగ్ తో కూడిన కామెడీ అన్నది లేకపోవటం. కానీ.. శమంతకమణిలో ఆ లోటును కూడా తీర్చేశారన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్‌తో చెప్పేశారు.
సినిమా కథ అవుటర్ లైన్ మనసుకు పట్టేసేలా కట్ చేసిన ఈ ట్రైలర్ చూసినంతనే.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న క్వశ్చన్ మనసులోకి రావటం ఖాయం. హైదరాబాద్ లో ఖరీదైన రెస్టారెంట్.. అక్కడో పార్టీ.. 500 మంది జనాలు.. ఆ పార్టీకి వచ్చే రూ.5 కోట్ల విలువైన కారు.. దాని కోసం డబ్బు అవసరం ఉన్న వారి లక్ష్యం.
ఇలా కథ ఎలా ఉంటుందో చెప్పేశారు. అయితే.. మధ్యలో హీరోయిన్ ముచ్చట తెచ్చేయటం.. మన కుర్రాళ్లందరికి అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ గురూ.. అంటూ ఫినిషింగ్ డైలాగ్‌తో ట్రైలర్ క్లోజ్ చేయటం చూస్తే.. సినిమాలో విషయం చాలానే ఉందన్న విషయాన్ని దర్శకుడి ట్రైలర్ తో చెప్పేశాడు. జులై రెండో వారంలో థియేటర్లను టచ్ చేయనున్న ఈ మూవీపై తాజా ట్రైలర్ మరింతగా అంచనాలు పెంచేసేదిలా ఉందని చెప్పక తప్పదు.