Begin typing your search above and press return to search.
#షేమ్ ఆన్ విజయ్ సేతుపతి.. అంత ఘోరం ఏం చేశాడని?
By: Tupaki Desk | 14 Oct 2020 5:30 AM GMTశ్రీలంక క్రికెట్ దిగ్గజం.. స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారు. మురళి 800 టెస్ట్ వికెట్లు తీసిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. తద్వారా 2008 లో తన 18 సంవత్సరాల క్రీడా జీవితాన్ని ముగించాడు. అతడిపై తెరకెక్కనున్న బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని నిజాల్ని నిర్భీతిగా చూపిస్తే ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. 800 మోషన్ పోస్టర్ ను ఇటీవల మేకర్స్ ఆవిష్కరించారు. ట్యాలెంటెడ్ బౌలర్ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెరపైకి వస్తాయని మేకర్స్ వెల్లడించారు.
అయితే నెటిజనుల్లో కొందరు 800 సినిమా నిర్మాతలు సహా విజయ్ సేతుపతిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. విజయ్ అన్యాయం చేస్తున్నాడని ట్విట్టెరాటీ వాదించారు.
800 మోషన్ పోస్టర్ లాంచ్ తరువాత, #ShameOnVijaySethupathi ట్విట్టర్ లో ట్రెండింగ్ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మురళీధరన్ స్వయంగా శ్రీలంకకు చెందిన తమిళుడు. దేశంలో 1977 లో జరిగిన అల్లర్లకు బాధితుడినని కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇదేదీ నెటిజనులకు పట్టలేదు. 800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ - వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు.