Begin typing your search above and press return to search.
ఓయ్ పాపకు ఇది భారీ బ్రేక్
By: Tupaki Desk | 26 Aug 2015 8:00 AM GMTసిద్ధార్థ్ సరసన ఓయ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది షామిలి. కానీ ఆ తర్వాత ఎందుకనో తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కాలక్రమంలో కనుమరుగైంది. అయితే షామిలి ఇప్పుడు ఓ కొత్త లుక్ తో మరోసారి కొత్త ఎటెంప్ట్ చేస్తోంది. ఇప్పటికిప్పుడు తమిళ్ లో ఓ మూడు ప్రాజెక్టులు ఈ అమ్మడి క్యూలో ఉన్నాయి.
విశాల్ సరసన సందకోజి 2 (పందెంకోడి 2)లో నటిస్తోంది. లింగుస్వామి ప్రొడక్షన్స్ లో లింగుస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వెంకట్ ప్రభు సరసన 'వీర శివాజీ' అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. సెప్టెంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. తగరారా ఫేం గణేష్ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఓయ్ షామిలి సక్సెసవ్వాలంటే సంథింగ్ ఏదైనా కొత్తగా చేయాల్సిందే. లేదంటే కష్టం. ఇప్పుడున్న నాయికలతో పోటీపడాలంటే యాక్టింగ్ ట్యాలెంటుతో పాటు ఇంకేదైనా కొత్తగా చేసి చూపించాలి. అదేంటో ఫార్ములా కనిపెట్టి తిరిగి వెనక్కి వచ్చిందంటారా? ఏదేమైనా వరసుగా మూడు సినిమాలంటే ఇది ఓయ్ పాపకు భారీ బ్రేకే. చూద్దాం ఈవిడ ఎలా వాడుకుంటుందో...