Begin typing your search above and press return to search.

మ‌లైకా బాట‌లో స్నేహితురాలు విడాకులు?

By:  Tupaki Desk   |   27 July 2022 5:30 AM GMT
మ‌లైకా బాట‌లో స్నేహితురాలు విడాకులు?
X
2021-22 సీజ‌న్ లో వ‌రుసగా సెల‌బ్రిటీ విడాకుల కేసులు అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెట్టాయి. అంత‌కుముందు మ‌లైకా అరోరాఖాన్ త‌న భ‌ర్త ఆర్భాజ్ నుంచి విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ జోడీ ఎవ‌రికి వారు స్వేచ్ఛగా స‌హ‌చ‌రుల‌తో జీవిస్తున్నారు. ఇప్పుడు మ‌లైకా బాట‌లో త‌న స్నేహితురాలు.. గాళ్స్ గ్యాంగ సభ్యురాలు ష‌మితా శెట్టి భ‌ర్త నుంచి విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చింది.

నటి షమితా శెట్టి శిల్పాశెట్టికి సోద‌రి అన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కి ష‌మిత సుపరిచితం.. కానీ ఇక్క‌డ స్థిర‌ప‌డ‌లేక‌పోయింది. ఇటీవల బాలీవుడ్ లో కూడా ఆఫ‌ర్లేవీ లేవ్. అదే క్ర‌మంలో బిగ్ బాస్ గ‌త సీజ‌న్ లో క‌నిపించింది. అక్క‌డ రాకేష్ బాప‌ట్ తో ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. అనంత‌రం పెళ్ల‌యింది. కానీ ఇటీవ‌ల‌ భ‌ర్త‌ రాకేష్ బాపట్ నుంచి ష‌మిత‌ విడిపోయారని రూమర్ లు వినిపిస్తున్నాయి.

ఎట్ట‌కేల‌కు ఈ విష‌యాన్ని ష‌మిత అధికారికంగా ధృవీకరించారు. షమిత మంగళవారం సాయంత్రం ఇన్ స్టాగ్రామ్ లో తాను రాకేష్ `ఇకపై కలిసి లేము` అని చెప్పారు. ఇద్దరూ గత సంవత్సరం బిగ్ బాస్ లో కలుసుకున్నారు. పాపులర్ రియాలిటీ షోలో తమ రిలేష‌న్ షిప్ ప్రారంభ‌మైంది. కానీ ఇంత‌లోనే ఇప్పుడు విడిపోతున్నారు.

బ్రేక‌ప్ వార్త‌లు వ‌స్తున్నా కానీ.. షమిత - రాకేష్ కలిసి ఒక‌ మ్యూజిక్ వీడియోలో కనిపించనున్నారు. దానిని ప్రస్తావిస్తూ.. వారి సంబంధం గురించి కూడా షమిత ఇన్ స్టాగ్రామ్ లో ఒక సింపుల్ నోట్ రాసింది. ``దీనిని (బ్రేక‌ప్ ని) స్పష్టం చేయడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. రాకేష్ - నేను ఇప్పుడు కలిసి లేము. కొంతకాలంగా దూరంగా ఉన్నాం. కానీ ఈ మ్యూజిక్ వీడియో మాకు చాలా మద్దతునిచ్చిన అభిమానులందరి కోసం`` అని ష‌మిత రాసారు. అభిమానులు సానుకూలంగా ఉండాలని ఇప్పటి వరకు ఉన్న ప్రేమను త‌మ‌కు అందించాలని షమిత కోరారు. ``మీ ప్రేమను మాకు అందించడం కొనసాగించండి. ఇక్కడ సానుకూలత కొత్త అంశాలు ఉన్నాయి. మీ అందరికీ ప్రేమ కృతజ్ఞతలు`` అని ఆమె నోట్ ముగించింది.

గత ఏడాది చివర్లో బిగ్ బాస్ లో కలిసిన తర్వాత షమిత - రాకేశ్ బాపట్ డేటింగ్ ప్రారంభించారు. షోలో వారి బంధంపై అభిమానులు చ‌క్క‌ని జోడీ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. కొన్ని నెలల తర్వాత షో ముగిశాక ఈ జంట‌ తమ సంబంధాన్ని ధృవీకరించారు. మార్చిలో షమిత రాకేష్ కుటుంబాన్ని కలవడానికి పూణే వెళ్లింది. ఈ ప్ర‌యాణం వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అయితే ఇంత‌లోనే విడిపోతున్నారని పుకార్లు షికార్ చేయడం ప్రారంభించాయి. ఎట్ట‌కేల‌కు అదే నిజ‌మైంది!

ష‌మిత బ్రేక‌ప్ వ‌ల్ల త‌న‌పై ప‌డిన ఒత్తిడి గురించి మాట్లాడింది. ``దురదృష్టవశాత్తూ మేం కొంతకాలం పబ్లిక్ ప్లాట్ ఫారమ్ లో ఉన్నందున నా రిలేష‌న్ షిప్ అలా ముగిసింది. మేము కొంత మొత్తంలో అభిమానుల ఫాలోయింగ్ ను సృష్టించాం. మా అభిమానులు మమ్మల్ని కలిసి చూడడానికి ఇష్టపడతారు. కానీ ఇది కఠినమైన ద‌శ‌. ఇది సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే నిరంతరం మిమ్మల్ని మీరు వివరిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది``అని అన్నారు.