Begin typing your search above and press return to search.
'బాహుబలి 2'ని టచ్ చేయలేని 'షంషేరా'?!
By: Tupaki Desk | 23 July 2022 3:43 AM GMTరాజమౌళి తెరకెక్కించిన బాహుబలి- RRR చిత్రాలు పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ వాటి వెంట పడడం ప్రారంభించింది. అయితే ఎంత ప్రయత్నించినా ఆశించిన సక్సెస్ దక్కలేదు. ఇప్పుడు అదే హిస్టారికల్ కాన్సెప్ట్ తో అదే జానర్ లో షంషేరా లాంటి భారీ చిత్రంతో రణబీర్ కపూర్ అభిమానుల ముందుకు వచ్చాడు. నేడు 'షంషేరా' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఈ చిత్రం మసాలా కంటెంట్ తో రియలిస్టిక్ ఎప్రోచ్ లో తెరకెక్కిందని సమీక్షకులు చెబుతున్నారు. రణబీర్ నటించిన తొలి బిగ్ స్క్రీన్ మసాలా ఎంటర్ టైనర్ ఇది. అగ్నిపథ్ ఫేమ్ కరణ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షంషేరాలో రణబీర్ కపూర్- సంజయ్ దత్- వాణి కపూర్ తదితరులు నటించారు. ఇది షంషేరా (బల్లి) పాత్ర చుట్టూ తిరిగే కథాంశం. రణబీర్ కపూర్ తన కెరీర్ లో మొదటిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తనవారిని (తెగను) బ్రిటీష్ వారి అగ్ర కుల గూండాల భారిన పడకుండా కాపాడే తక్కువ కులానికి చెందిన వీరుడిగా రణబీర్ ఈ చిత్రంలో విరోచిత పాత్రలో నటించాడు.
బలహీనులైన తనవారు ఎక్కువ కులానికి చెందిన బ్రిటీష్ అనుచరుల పీడితులు కాకుండా కాపాడేందుకు కథానాయకుడు ఎలాంటి సాహసాలు చేశాడన్నది తెరపై ఆవిష్కరించారు. ఇందులో సంజయ్ దత్ దరోగా శుద్ధ్ సింగ్ అనే అవినీతి పోలీస్ గా.. భారతీయ పోలీసు అధికారులకు వ్యతిరేకిగా కనిపిస్తాడు. ఎంపిక చేసుకున్న కథాంశం భారీ యాక్షన్ కి ఎమోషన్స్ కి ఆస్కారం ఉన్నదే. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేయనుందో చూడాలన్న ఆసక్తి రణబీర్ అభిమానులు సహా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
షంషేరా బాక్సాఫీస్ కలెక్షన్ డే 1 వివరాల ప్రకారం..ప్రధాన మల్టీప్లెక్స్ చైన్ లలో టిక్కెట్ల విక్రయాల ట్రాకింగ్ ప్రకారం.. భూల్ భూలయ్యా 2 వసూళ్లను సైతం అధిగమించలేకపోయిందని ట్రేడ్ చెబుతోంది. షంషేరా 2022లో అత్యుత్తమ అడ్వాన్స్ బుకింగ్ లను సాధించినా కానీ కార్తీక్ ఆర్యన్ సినిమా కంటే తక్కువ ఓపెనింగులతో మొదలైంది. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయా 2 చిత్రం కంటే రేసులో వెనుకబడిందని టాక్ వినిపిస్తోంది. అయితే అనేక సింగిల్ స్క్రీన్ లకు సంబంధించిన రిపోర్టులు ఇంకా అందలేదని తెలిసింది. నిజానికి షంషేరా వంటి భారీ కమర్షియల్ మాస్ మూవీకి సాధారణంగా 1వ రోజున మ్యాసివ్ కలెక్షన్లు రావాల్సి ఉంది. కానీ అది ఆశించిన స్థాయిలో లేదని బాలీవుడ్ మీడియాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ చిత్రం డే వన్ లో రూ.12-13 కోట్ల మధ్య వసూల్ చేస్తుందని అంచనా. బాక్సాఫీస్ వద్ద నికర వసూళ్ల పరంగా చూస్తే.. ఈ చిత్రం బాహుబలి 2 సాధించిన రూ.14.11 కోట్ల (హిందీ) నికర ఓపెనింగ్ రికార్డ్ ను అధిగమించలేదు. 2022లోనే విడుదలైన భూల్ భులయా 2 రికార్డును కూడా షంషేరా ఓపెనింగుల పరంగా అధిగమించలేకపోయింది.
సమీక్షకుల ప్రకారం.. షంషేరా మొదటి సగభాగం చాలా వినోదాత్మకంగా సాగింది.. మంచి ఇంటర్వెల్ బ్లాక్ తో ఆకట్టుకుకుంది. కానీ క్లైమాక్స్ రిపీటెడ్ గా అనిపిస్తుందని.. సెకండ్ హాఫ్ నెమ్మదించిందని.. స్లో ఫేస్ మూవీ ఇదని విమర్శలొచ్చాయి. రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం.. పైసా-వసూల్ మాస్ హీరోయిజం సినిమాకి ప్రధాన అస్సెట్. సంజయ్ దత్ మరోసారి అగ్నిపథ్ తరహా విలనీని రిపీట్ చేశాడని టాక్ వచ్చింది. బాలీవుడ్ లోని 60 లు 70- 80ల నాటి డెకాయిట్ తరహా సినిమాలను ఇష్టపడేవారికి షంషేరా ట్రీట్ గా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
షంషేరాలో రోనిత్ రాయ్ - సౌరభ్ శుక్లా తదితరులు నటించారు. మంచి ఫామ్ లో ఉన్న ఇలాంటి స్టార్లను చాలా తక్కువగా ఉపయోగించుకోవడం నిరాశపరిచిందని సోషల్ మీడియాల్లో టాక్ వినిపిస్తోంది.