Begin typing your search above and press return to search.
రిలీజ్ డేట్ టీజర్ తోనే 'షంషేరా' హెచ్చరికలు జారీ!
By: Tupaki Desk | 17 Feb 2022 6:14 AM GMTరణబీర్ కపూర్.. సంజయ్ దత్ ..వాణీకపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం `షంషేరా`. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పై ఆదిత్య చోప్రార భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2018 లో షూటింగ్ ప్రారంభించిన టీమ్ 2020 లో చిత్రీకరణ పూర్తిచేసింది.
దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ కే మేకర్స్ సమయాన్నికేటాయించారు. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటిని దాటుకుని దిగ్విజయంగా షూటింగ్ పూర్తిచేసారు. అప్పటి నుంచి సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోది.
అయితే ఈ డిలేకి కారణం కరోనా. 2020లో జనవరి లో షూటింగ్ పూర్తయిన కరోనా వివిధ వేరియెంట్ల రూపంలో విరుచుకుపడటంతో సాంకేతిక పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీనికి తోడు పీరియాడిక్ సినిమా కావడంతో టెక్నికల్ గాను ఎక్కువగా సమయం పట్టింది.
అయితే ఎట్టేకేలకు ఈ వార్ ఎంటర్ టైనర్ థియేటర్ రిలీజ్ తేది ఖరారు అయింది. జులై 22న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ దానికి సంబంధించిన రిలీజ్ టీజర్ తో రివీల్ చేసారు. హిందీ తో పాటు తెలుగు..తమిళ్ భాషల్లోనూ చిత్రం విడుదలవుతుంది. ఇక తాజా టీజర్ తో `షంషేరా`పై అంచనాలు పెంచే ప్రయత్నం కనిపిస్తోంది.
సంజయ్ దత్...వాణీకపూర్...రణబీర్ కపూర్ షంషేరాని ప్రమోట్ చేస్తూ ఈ టీజర్ కట్ చేసారు. ఈ మూడు పాత్రలు సినిమాలో ఆసక్తికరమని తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రిలీజ్ డేట్ టీజర్ తోనే సినిమాలో ఇంటెన్స్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఇక అసలైన టీజర్..ట్రైలర్ రిలీజ్ అయితే` షంషేరా` ఇంకే స్థాయిలో మార్కెట్ లో కి దూసుకుపోతుంతో చెప్పాల్సిన పనిలేదు. ఇక రణబీర్ కపూర్ 1484 రోజుల తర్వాత థియేటర్లో కనబడటం ఇదే తొలిసారి. రాక్ స్టార్ చివరి సారిగా 2018 లో రిలీజ్ అయిన `సంజు` సినిమాలో నటించాడు.
ఆ తర్వాత డేట్లు అన్ని `షంషేరా` చిత్రానికే కేటాయించి ఆ సినిమా పనుల్లోనే నిమగ్నమయ్యాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రణబీర్ శ్రమించారు. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. మరో వైపు `బ్రహ్మస్ర్త` సినిమాతోనూ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 9న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
ఇందులో తెలుగు నటుడు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. ఆయన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలియా భట్.. మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఇలా రణబీర్ కపూర్ కి భారీ గ్యాప్ వచ్చినా ఒకే ఏడాది అందులోనూ ఒకనెల గ్యాప్ లోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరంచడానికి రెడీ అవుతున్నాడు.