Begin typing your search above and press return to search.

న‌డుము ఊపుడు స‌రే కానీ ఎక్స్ ప్రెష‌న్ ఏదీ అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   19 Feb 2021 2:30 AM GMT
న‌డుము ఊపుడు స‌రే కానీ ఎక్స్ ప్రెష‌న్ ఏదీ అమ్మ‌డూ?
X
ప‌రిశ్ర‌మ‌లో న‌ట‌వార‌సులు లేదా సెలబ్రిటీ కిడ్స్ బ‌ల‌వంత‌పు రుద్దుడు వ్య‌వ‌హారం గురించి నిరంత‌రం ఏదో ఒక చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. నెప్టోయిజం స్టార్ల‌పై పెట్టుబడులు పెట్టే వాళ్లుంటే.. ‌వార‌సులు ఉత్సాహ‌ప‌డినంత‌నే హీరోలుగా హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేసేస్తుంటారు. కానీ అలాంటి వాళ్ల‌కు తెలియాల్సిన‌ది ఒక‌టి ఉంది.

క‌ళ అనేది అంద‌రికీ అబ్బే విద్య కాదు. ఏదో ఉబ‌లాటం ఉంది క‌దా? అని వెండితెర కు ట్రై చేస్తే కుద‌ర‌దు. పైగా డ్యాన్సులు న‌ట‌న ప‌రంగా చాలా చూపించాల్సి ఉంటుంది. కొంద‌రు నేర్చుకున్నా కానీ వాటిని స‌రిగా ప్రెజెంట్ చేయ‌లేరు. మ‌రికొంద‌రికి ముఖంలో క‌వ‌ళిక‌లు క‌నిపించ‌వు. అవ‌స‌రం మేర కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించ‌వు.

ముఖ్యంగా డ్యాన్స్ అనే అరుదైన విద్య‌లో ముఖ క‌వ‌ళిక‌లు ప్ర‌ద‌ర్శిస్తూ నృత్యాల్ని ఎలివేట్ చేయ‌డం ఆషామాషీ ఏమీ కాదు. ఆర్టిఫిషియ‌ల్ ముఖ క‌వ‌లిక‌ల‌కు నేచురల్ ఎక్స్ ప్రెష‌న్స్ కి మ‌ధ్య తేడా తెలిసిపోతుంటుంది. ఇక ప్ర‌తిదీ ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్లు వేరు. చేయ‌లేని వాళ్లు వేరు.

ఇదిగో ఇక్క‌డ ఈ రెండో కేట‌గిరీలోనే క‌నిపిస్తోంది స‌ద‌రు సెల‌బ్రిటీ కిడ్. బాలీవుడ్ నిర్మాత సంజ‌య్ కపూర్ వార‌సురాలు.. సోన‌మ్ జాన్వీల చుట్టం .. సుహానా ఖాన్ ఫ్రెండు స‌నాయ క‌పూర్ త్వ‌ర‌లోనే క‌థానాయికగా ఆరంగేట్రం చేయ‌నుంది. అంత‌కుముందే ఇన్ స్టాలో పాపులారిటీ కోసం ఇదిగో ఇలా నిరంత‌రం బెల్లీ డ్యాన్సులు వేడెక్కించే ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తోంది.

అయితే ఈ అమ్మ‌డు చాలా శ్ర‌మిస్తోంది కానీ ఎక్స్ ప్రెష‌నే క‌నిపించ‌డం లేద‌న్నది యూత్ విమ‌ర్శ. మ‌రి దీనినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేస్తుందో చూడాలి. బాహుబ‌లి మ‌నోహ‌రిలా.. మ‌లైకా అరోరాలా.. క‌నీసం అన‌న్య పాండేలా అయినా స్వింగ్ అయితే క‌నిపించ‌డం లేదు. అది ఉన్న‌ప్పుడే ఏ డ్యాన్స్ కి అయినా గౌర‌వం. మ‌రి స‌న‌యా గుర్తిస్తుందా?