Begin typing your search above and press return to search.

ఆ 'క్షణం'లో అమెరికా కన్ను

By:  Tupaki Desk   |   19 Feb 2016 1:30 PM GMT
ఆ క్షణంలో అమెరికా కన్ను
X
క్షణం మూవీ టీజర్ విడుదల అయినప్పటి నుంచి ఓ సంచలనమే. ఓ చిన్నారి కిడ్నాప్ థ్రిల్లర్ ని చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారనే అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ఈ మూవీకి అయిన ఖర్చు కోటి రూపాయల్లోపే అని తెలియడంతో ఇండస్ట్రీ అంతా నోరెళ్లబెట్టేసింది. ఈ మూవీలో అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది విజువల్సే. సన్నివేశాలతో పాటు యాక్టర్లను చూపించిన విధానం కొత్తగా ఉంది.

కెమేరా యాంగిల్స్ కానీ.. కేప్చరింగ్ గానీ విభిన్నంగా కనిపించింది. సాధారణంగా మనం చూస్తున్న టాలీవుడ్ సినిమాలకు ఎంతో విభిన్నంగా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలిసింది. క్షణం కోసం షానియల్ డియో అనే ఓ కొత్త సినిమాటోగ్రాఫర్ వర్క్ చేశాడు. కొత్త అంటే మనకు కొత్తకానీ.. ఈయన హాలీవుడ్ మూవీస్ కి కెమేరమెన్. ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా నామినేట్ అయిన ఘనత షానియెల్ డియోకు ఉంది. ఈయనత తీసిన లేలా అనే ఓ షార్ట్ ఫిలిం కేన్స్ కు ఎంపికైన తర్వాత.. అంతర్జాతీయగా పలు ఆఫర్స్ వచ్చాయి.

అయితే క్షణం మూవీ యూనిట్ అప్రోచ్ అయినపుడు మాత్రం, తను ఈ ప్రాజెక్టును పర్ ఫెక్ట్ గా డీల్ చేయగలననే నమ్మకం కుదరడంతో క్షణంకు సైన్ చేశాడట ఈ కెమోరా మన్. ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ మూవీకి ఈయన వర్క్ స్టార్ట్ చేస్తుండగా.. ఈ నెల 26న క్షణం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నాడు.