Begin typing your search above and press return to search.

ఫిజీ నుంచి వచ్చిన కేమెరామ్యాన్

By:  Tupaki Desk   |   23 Feb 2016 3:30 PM GMT
ఫిజీ నుంచి వచ్చిన కేమెరామ్యాన్
X
ఈ నెల 26న అడివి శేష్ - ఆదాశర్మ - అనసూయలు నటించిన క్షణం విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ - ట్రైలర్ లు విపరీతంగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం.. కెమేరా పనితీరు. సూపర్బ్ విజువల్స్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోంది క్షణం మూవీ. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన షానియల్ డియో.. ఫిజీ వ్యక్తి. అడివి శేష్ కి, షానియెల్ కి అనుకోకుండా జరిగిన పరిచయం.. వీరిద్దరి మధ్య రిలేషన్ పెంచింది.

అడివి శేష్ రచన, దర్శకత్వంలో తనే హీరోగా నటించి చేసిన 'కిస్' చిత్రానికి కూడా ఈ షానియల్ డియో ఛాయాగ్రహణం అందించాడు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైన లైలా షార్ట్ ఫిలింతో పేరు తెచ్చుకున్న షానియల్.. ఆ సమయంలోనే అడివి శేష్ ని కలిశాడు. క్షణం మూవీ స్టోరీ చెప్పినపుడు బాగా ఎగ్జయిట్ అయ్యాడట షానియల్. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వీలుగా రియలిస్టిక్ లొకేషన్స్ లో చిత్రీకరించామని అంటున్నాడు. అలాగే.. ప్రతీ మూమెంట్ ని పర్ఫెక్ట్ క్యాచ్ చేసేందుకు గాను దర్శకుడు ఎంతో డీటైల్డ్ గా స్క్రిప్ట్ వివరించాడట. అంతే కాదు ప్రతీరోజు ఉదయాన్నే ఆ రోజు తీయబోయే సన్నివేశాలను కూడా అనలైజ్ చేసి చెప్పడంతో ఇంత పర్ఫెక్ట్ గా ఈ మూవీ వచ్చిందని అంటున్నాడు షానియల్.

ఈ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో.. ఫిజీ వాసుడే అయినా.. ఇతని పూర్వీకులు మాత్రం ఇండియాకి చెందిన వాళ్లే కావడం విశేషం. 170 ఏళ్ల క్రితం ఇతని ముందు తరాల వారు ఫిజీ వెళ్లి సెటిల్ అయిపోయారట. ఏడాదిగా హైద్రాబాద్ లోనే ఉండడంతో.. ఇప్పుడిదే తన సొంతిల్లుగా అనిపిస్తోందని చెబుతున్నాడు షానియల్.