Begin typing your search above and press return to search.
శంకర్ దెబ్బకు దిగొచ్చిన కమెడియన్
By: Tupaki Desk | 23 Nov 2018 1:30 AM GMTతమిళ అగ్ర దర్శకుడు శంకర్ నిర్మాణంలో వడివేలు హీరోగా దర్శకుడు చింబుదేవన్ తీసిన ‘హింసరాజు 23వ పులకేసి’ సినిమా గుర్తుందా? ఈ చిత్రం తమిళంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ విడుదలై ఓ మాదిరిగా ఆడింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘24వ పులకేసి’ సినిమా తీయాలని శంకర్-చింబు దేవన్ భావించారు. చింబు దేవన్ స్క్రిప్టు రెడీ చేశాడు. వడివేలుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి షూటింగుకి అంతా రెడీ చేసుకున్నాక వడివేలు అడ్డం తిరిగాడు. శంకర్-చింబు దేవన్ లతో అభిప్రాయభేదాలు వచ్చి వడివేలు ఈ సినిమా చేయడానికి నిరాకరించాడు. తాను తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇవ్వలేదు. వడివేలు వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది శంకర్ టీంకు.
దీంతో శంకర్ నిర్మాతల మండలి.. నడిగర్ సంఘంలను ఆశ్రయించి కొంత కాలంగా పోరాడుతున్నారు. ఇరు సంఘాలూ వడివేలుదే తప్పు అని తేల్చాయి. అతను ఈ సినిమా చేయకుంటే నిషేధం విధించడానికి కూడా రెడీ అయ్యాయి. అయినా కొన్నాళ్లు భీష్మించుకుని కూర్చున్నాడు వడివేలు. ఐతే ఎట్టకేలకు అతన దిగి వచ్చాడు. శంకర్ తో చర్చించిన అనంతరం ఈ సినిమా చేయడానికి ఓకే అన్నాడు వడివేలు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో నిషేధం పడితే చాలా కష్టమని.. అలాగే నష్టపరిహారం కింద చాలా మొత్తం ఇచ్చుకోవడం కూడా సాధ్యం కాదని భావించి వడివేలు దిగి వచ్చాడట. ప్రస్తుతం మధురైలో ఉంటున్న వడివేలు చిత్రీకరణ కోసం చెన్నై వచ్చేందుకు సమ్మతించారట. జనవరిలో ‘24వ పులకేసి’ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట.