Begin typing your search above and press return to search.
రజినీ రోబో2 ట్రైలర్ డేట్ ఇదే!!
By: Tupaki Desk | 11 March 2017 4:29 PM GMTరజినీకాంత్ లేటెస్ట్ మూవీ రోబో2.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక పాట.. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిపోయిందని స్వయంగా దర్శకుడు శంకర్ చెప్పాడు. ఈ నెల చివరి వారానికల్లా మొత్తం షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టేయనున్నారు.
రోబో సీక్వెల్ గా 2.0 టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. ట్రైలర్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది యూనిట్. సెప్టెంబర్ 29న ఈ సీక్వెల్ ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయినా.. ఇంకా ఆరు నెలల పాటు కనీసం ఈ ట్రైలర్ కోసం ఎదురు చూడాలన్న మాట. ఆ తర్వాత నెల రోజులకు గానీ సినిమా రిలీజ్ కాదు. ఇంత సుదీర్ఘంగా టైం కేటాయించడానికి కారణం.. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కావడమే. అధికారికంగానే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటిపోయింది.
రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ కోసం.. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకొచ్చాడు దర్శకుడు శంకర్. అందుకే బడ్జెట్ ఇప్పటికే చాలా ఎక్కువే అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకే ఇంత సుదీర్ఘం కాలం టైం తీసుకుంటోంది రోబో 2.0 మూవీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/