Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్:కమర్షియల్ సినిమాల గాడ్ ఫాథర్

By:  Tupaki Desk   |   17 Aug 2016 4:44 AM GMT
బర్త్ డే స్పెషల్:కమర్షియల్ సినిమాల గాడ్ ఫాథర్
X
తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ లోనే వుంటాయి మావా.. అందుకే అంతంత హిట్ లు అవుతూ వుంటాయి. ఇది సగటు సినిమా జ్ఞానం లేని చాందసుల వాదన. ఒక సినిమాను భారీగా తీసినంత మాత్రాన విజయం సాధించదు. ఆ కథలో ఎదో కొత్తదనం వుండాలి. పాత్ర మనతో ట్రావెల్ చేస్తూ వుండాలి. సమాజానికి - సంఘానికి ఉపయోగపడితే అది మరింత బోనస్.

ఈ లెక్కలన్నీ తూచా తప్పకుండా పాటించి ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు ఎత్తుకెళ్ళిన ఘనత దర్శకుడు శంకర్ ది. అటువంటి గాడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ కమర్షియల్ మూవీస్ జన్మదినం నేడు. సామాజిక అంశాలను - కమర్షియల్ ఎలిమెంట్లను కలిపి చెప్పడం అంటే ఒబామా - ఒసామాలను కలిపి మల్టీ స్టారర్ తీయడం అంత కష్టతరం. అటువంటి ఫీట్ ని అలవోకగా తన సినిమాలలో చూపించగలిగే సత్తా శంకర్ ది.

తొలి సినిమా 'జెంటిల్ మేన్'తో అర్జున్ లో అవార్డ్ రేంజ్ నటుడ్ని పరిచయం చేశాడు. ప్రభుదేవతో ప్రేమికుడు బ్లాక్ బస్టర్. ఇక శంకర్ మైలు రాళ్ళగా చెప్పుకునే సినిమాలు 'భారతీయుడు' - 'ఒకే ఒక్కడు'. 'సేనాపతి'గా కమల్ హాసన్ - 'పురుషోత్తం' గా అర్జున్ ని చూపించడానికి తను చేసిన రీ సెర్చ్, తాను పడ్డ కష్టం ప్రతీ ఫ్రేం లోనూ కనిపిస్తాయి. 'అపరిచితుడు'తో కొత్తరకం డిజార్డర్ ను మనకు పరిచయం చేసిన ఈ మాస్టర్ మైండ్.. రీసెంట్ గా రజినిని 'రోబో'గా చూపించి సౌత్ ఇండియన్ ఫిలిం లెవెల్ ని నేషనల్ స్థాయిలో నిలబెట్టాడు.అయితే అతని లేటెస్ట్ ఫ్లిక్ విక్రమ్ 'ఐ' సినిమా నిరాశ పరిచినా త్వరలో రాబోతున్న రోబో సీక్వెల్ 2.0 ద్వారా తానేంటో ప్రపంచానికి తిరిగి చాటి చెప్పనున్నాడు. ఈ డేరింగ్ డైరెక్టర్ తన కెరీర్ లో మరెన్నో అద్భుతాలు తెరకెక్కించాలని కోరుకుంటూ తుపాకీ.కామ్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.