Begin typing your search above and press return to search.
రోబో లో అమితాబ్ విలన్ గా చేసి ఉంటే..
By: Tupaki Desk | 22 Nov 2015 7:30 PM GMTరోబో సినిమా చాలా మంది దగ్గరికెళ్లి చివరికి రజినీకాంత్ దగ్గర ఆగిందన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ అందులో విలన్ పాత్రకు కూడా శంకర్ వేరే నటుణ్ని అనుకున్నాడని.. అది కూడా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని.. ఆ పాత్ర చేయడానికి ఆయన ఓకే కూడా చెప్పారని మనకు తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు శంకర్.
ముందు కమల్ హాసన్ ను హీరోగా అనుకుని.. ఆ తర్వాత షారుఖ్ దగ్గరికి వెళ్లి - కథ విషయంలో ఇద్దరికీ తేడా రావడంతో చివరికి రజినీకాంత్ ను హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు శంకర్. ఐతే షారుఖ్ తో ‘రోబో’ తీయాలనుకున్నపుడు విలన్ గా అమితాబ్ బచ్చనే అని ఫిక్సయిపోయాడట శంకర్. షారుఖ్ తో కాదు అనుకున్నాక కూడా అమితాబే శంకర్ మనసులో ఉన్నాడట.
అమితాబ్ కు కథ కూడా చెప్పి ఆయనతో ఓకే చేయించుకున్న శంకర్.. డేట్ల కోసం తర్వాత సంప్రదిస్తానని చెప్పి వచ్చేశాడట. ఐతే రజినీకాంత్ కు అమితాబ్ ను విలన్ గా పెట్టడం కరెక్ట్ కాదని, పైగా రజినీ కూడా ఇందులో నెగెటివ్ పాత్ర చేస్తున్నాడు కాబట్టి అమితాబ్ విలన్ పాత్రలో కనిపిస్తే ఎలివేట్ కాడని భావించి మనసు మార్చుకున్నాడట. దీంతో బిగ్ బికి ఫోన్ చేసి సారీ కూడా చెప్పాడట. ఆ తర్వాత సత్యరాజ్ - జేడీ చక్రవర్తి లాంటి వాళ్లను అనుకుని చివరికి బాలీవుడ్ విలన్ డానీ డెన్ జాంగ్ పాను కన్ఫమ్ చేశాడు శంకర్. హీరోయిన్ గా కూడా దీపికా పదుకునే - శ్రియ - నయనతార.. ఇలా ఒక్కో పేరు పరిశీలించి చివరికి ఐశ్వర్యను ఓకే చేశాడు.