Begin typing your search above and press return to search.

'2.0' టైటిల్ వెనుక అదీ కథ

By:  Tupaki Desk   |   30 Sep 2018 3:20 AM GMT
2.0 టైటిల్ వెనుక అదీ కథ
X
ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంటే సింపుల్‌ గా పేరు వెనుక డ్యాష్ పెట్టి ‘2’ తగిలించేస్తుంటారు. ఐతే శంకర్ మాత్రం ‘రోబో’ సీక్వెల్‌ కు ‘రోబో’ పేరు వాడుకోలేదు. ‘2.0’ అని టైటిల్ పెట్టాడు. మరి ఈ పేరే పెట్టడానికి కారణమేంటి.. దీని వెనుక కథాకమామిషు ఏంటి.. అన్నది ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నిజానికి ‘2.0’ అనే మాట ‘రోబో’లోనే ఉందట. దాన్ని ఎవ్వరూ గమనించి ఉండరని అంటున్నాడు శంకర్. చిట్టి రోబో చాలా వయొలెంట్ గా తయారై అందరి మీద దాడి చేసే సమయంలో బ్యాగ్రౌండ్లో ఒక పాట వస్తుంది. ఆ పాటలో రెహమాన్ ‘2.0’ అనే సౌండింగ్‌ ను ఉపయోగించాడని శంకర్ వెల్లడించాడు. చిట్టికి రెండో వెర్షన్ ఇదని చెప్పడానికి సూచికగా రెహమాన్ ఆ మాటను జోడించినట్లు చెప్పాడు. అది విన్నపుడు సౌండింగ్ భలేగా అనిపించిందని శంకర్ చెప్పాడు.

‘రోబో’ సీక్వెల్‌ కు ఏం పేరు పెట్టాలా అనుకున్నపుడు తనకు రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ స్ట్రైక్ అయిందని.. ‘2.0’ అంటే అడ్వాన్స్డ్ వెర్షన్ కూడా కాబట్టి ఆ టైటిల్ బాగుంటుందని అనిపించిందని అలా ఆ టైటిల్ ఫిక్సయిందని శంకర్ తెలిపాడు. ఇక ‘2.0’ కథ ఎలా పుట్టిందో చెబుతూ.. దీని ట్రైలర్లో మనుషుల దగ్గర్నుంచి మొబైల్ ఫోన్స్ ఎగిరిపోయే షాట్ తనకు ముందుగా తట్టిందని చెప్పాడు. దీన్నుంచి సెల్ ఫోన్ అడిక్షన్ అనే కాన్సెప్ట్ మీద వర్కవుట్ చేసి కథ సిద్ధం చేశానన్నాడు. ‘రోబో’ సినిమా అయిన వెంటనే దానికి పని చేసిన నటీనటులు.. సాంకేతిక నిపుణులతో పాటు అభిమానులు కూడా సీక్వెల్ చేయాలని ఆశించారని.. ఐతే ఈ సినిమా బాగా ఆడింది కాబట్టి.. సీక్వెల్ చేస్తే క్రేజ్ ఉంటుంది కాబట్టి చేయాలని అనుకోలేదని.. తనను ఎగ్జైట్ చేసే కథ కోసం చూశానని.. ఆ ఐడియా వచ్చాక సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టానని శంకర్ వెల్లడించాడు.