Begin typing your search above and press return to search.
చరణ్ కోసం విలన్ ను వెతికి పట్టుకున్న శంకర్!
By: Tupaki Desk | 23 Feb 2022 10:30 AM GMTచరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఆయన బ్యానర్లో వస్తున్న 50వ సినిమా. ఆయన కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది.
ఈ షెడ్యూల్స్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని రొమాంటిక్స్ సీన్స్ ను కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేయనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిన ప్రశ్న. ఈ పాత్ర కోసం చాలామంది ఆర్టిస్టుల పేర్లను శంకర్ పరిశీలించాడు. చివరికి ఎస్.జె. సూర్యను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
దర్శకుడిగా 'ఖుషీ' .. 'వాలి' వంటి సూపర్ హిట్లను ఇచ్చిన ఎస్.జె. సూర్య, ఆ తరువాత నటుడిగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా ఆయన విలన్ పాత్రలకు ఫేమస్ అయ్యాడు. 'స్పైడర్' సినిమాతో ప్రతినాయకుడిగా ఆయనకి మంచి మార్కులు దక్కాయి. ఇక రీసెంట్ గా తమిళంలో వచ్చిన 'మానాడు'లో చేసిన విలన్ పాత్ర కూడా ఆయనకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఇటీవల తమిళంలో వచ్చిన 'మానాడు' అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య పోషించిన విలన్ పాత్రను గురించి అక్కడి ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాలో ఆయన నటనను చూసిన తరువాతనే శంకర్ ఆయనను ఎంపిక చేయడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమిషనర్ పాత్రలో నటిస్తుండగా, ముఖ్యమంత్రి పాత్రలో ఎస్.జె. సూర్య కనిపించనున్నాడని అంటున్నారు. ఒక ఎలక్షన్ కమిషనర్ కీ .. ముఖ్యమంత్రికి మధ్య జరిగే వార్ తో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని అలరించనుంది. 'వినయ విధేయ రామ' తరువాత ఆమె చరణ్ తో చేస్తున్న సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. ఆయన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అంజలి .. సునీల్ .. జయరామ్ కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.