Begin typing your search above and press return to search.
శంకర్ కాంప్రమైజ్ కి కారణమేమిటి?
By: Tupaki Desk | 17 Dec 2015 5:30 PM GMTతన కెరీర్ లోనే ఎంతో ఒత్తిడిలో వున్న తరుణంలో శంకర్ మొదలుపెట్టిన చిత్రం రోబో 2. శంకర్ కలల ప్రాజెక్ట్ కి సీక్వెల్ గా నిలుస్తున్న ఈ చిత్రంపై మొదలవకుండానే ఎన్నో అంచనాలు ఏర్పడడం సహజం. అయితే రోబో చిత్రానికి మాదిరిగానే ఈ సినిమాకు సైతం శంకర్ నటీనటుల విషయంలో కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది.
రోబో మొదటి భాగం కమల్, ప్రియాంక చోప్రా లతో మొదలుపెట్టి బడ్జెట్ లేక ఆగిపోయిన సంగతి తెలిసినదే. ఆ కధ బాలీవుడ్ ఖాన్ ల కు వినిపించినట్టు కూడా సమాచారం. విలన్ గా అమితాబ్ ని అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అవే ఘటనలు రోబో 2 కి ఎదురయ్యాయి. విలన్ గా ఆర్నాల్డ్, అమీర్ లు వినిపించినా, హీరోయిన్ గా దీపికా వంటి స్టార్ నటుల సొగసులు చూపిద్దాం అనుకున్నా అవేమి కార్యరూపం దాల్చక చివరి ఆప్షన్ లు గా అక్షయ్, అమీ జాక్సన్ లను ఎంపిక చేసుకున్నాడు. శంకర్ కాంప్రమైజ్ కి సరైన కారణం ఇప్పటికీ తెలియలేదు.
అయితే ఎన్నో అవాంతరాలను ఎదుర్కుని రోబో సూపర్ హిట్ అవ్వడంలో టెక్నికల్ టీం ప్రధాన పాత్ర పోషించింది. రోబో 2లో ఎక్కడ కాంప్రమైజ్ అయినా టెక్నీషియన్ల టీమ్ లో మాత్రం జురాసిక్ పార్క్ వంటి సినిమాలకు పని చేసిన మేటి టెక్నీషియన్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.