Begin typing your search above and press return to search.
2.0 సెట్ లో ఇంట్రెస్టింగ్ థింగ్స్
By: Tupaki Desk | 18 Dec 2015 5:30 AM GMTశంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సీక్వెల్ సినిమా -2.0. టైటిల్ ఇలా ఉందేంటి? అనేదానికి ఈ దర్శకదిగ్గజం దగ్గర బోలెడంత సమాధానం ఉంది. రోబోటిక్ లాంగ్వేజ్ లో దీనికి బోలెడంత మీనింగ్ ఉంది. `సీక్వెల్ టు ఎందీరన్` అనే ఉపశీర్షికతో తమిళ్ లో తెరకెక్కుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని `ఇట్స్ ఎ సీక్వెల్ టు రోబో` అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేస్తారు. అయితే మొన్నటిరోజున రోబో చిత్రీకరణ అధికారికంగా మొదలైంది. తొలిరోజు సెట్ లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఏ.ఆర్.రెహమాన్ - విలన్ క్యారెక్టర్ చేస్తున్న అక్షయ్ కుమార్ - వంటివారు వచ్చి విజిట్ చేశారు.
సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా ఈ చిత్రానికి వండర్ ఫుల్ ఫోటోగ్రఫీ అందించనున్నారని చెబుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలన్ని చెన్నయ్ ఔట్ స్కర్ట్స్ లో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. డా. వశీకరణ్ తన చుట్టూ ఉన్న రోబోలతో ప్రయోగాలు చేస్తుంటారు. అదో ప్రయోగశాల. ఇందులో కొన్ని రోబోలు వశీకరణ్ కి అసిస్టెంట్లుగా కనిపిస్తాయి. ఈ అసిస్టెంట్ లతో కొంత హ్యూమర్ ని కూడా ప్లాన్ చేశారు శంకర్. రకరకాల రోబోల మోడల్స్ సెట్ లో కనిపించాయి.
సరిగ్గా సాయంత్రం 6.30కి ఏ.ఆర్.రెహమాన్, 7గంటలకు అక్షయ్ కుమార్ సెట్స్ కి వచ్చారు. అప్పటికే రజనీపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ - రెహమాన్ కొద్దిసేపు శంకర్ తో ముచ్చట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్షయ్ మరి కొద్ది రోజుల్లో రోబో షూట్ లో జాయిన్ అవుతారుట. అదేరోజు ముత్తురాజ్ కూడా సెట్ లో కనిపించారు. ఇక ఈ చిత్రాన్ని 2డి - 3డి ఫార్మాట్ లో శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇన్ని విశేషాలు తొలిరోజు దర్శనమిచ్చాయి. అదీ మ్యాటరు.