Begin typing your search above and press return to search.
3.0 జరిగే పనేనా?
By: Tupaki Desk | 2 Dec 2018 5:53 AM GMTవీక్ ఎండ్ ని బాగా దున్నేస్తున్న 2.0కు రేపటి నుంచి అసలైన పరీక్ష మొదలవుతుంది. పెట్టిన బడ్జెట్ ఉన్న అంచనాలు వస్తున్న వసూళ్లు ఇవన్ని కాసేపు పక్కన పెడితే రోబో ఫస్ట్ పార్ట్ రేంజ్ లో 2.0 అందరిని యునానిమస్ గా అలరించలేదు అన్నది వాస్తవం. పిల్లలను టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్దల టికెట్లు వస్తాయనే ఉద్దేశంతో తాజా ప్రమోషన్ లో ఇప్పటిదాకా గుట్టుగా దాచిపెట్టిన చిట్టి రోబో ఉరఫ్ 3.0ని టీజర్స్ లో వాడటం మొదలుపెట్టారు. అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ లో దీన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత బయటికి వచ్చేసింది.
క్లైమాక్స్ తో పాటు చిట్టి పక్షి రాజు మొదటిసారి క్లాష్ అయ్యే సన్నివేశాలలో గ్రాఫిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పటికీ మిగిలినవి మాత్రం సోసోగానే ఉన్నాయన్న కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు మౌత్ పబ్లిసిటీలో కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం వస్తుందా అనే అంచనాలు చర్చలు మొదలైపోయాయి. ఇప్పటికే పెట్టిన బడ్జెట్ సుమారు 500 కోట్ల దాకా ఉండటంతో దాన్ని మొత్తాన్ని షేర్ రూపంలో రికవరీ చేయడం అంత సులభంగా కనిపింకచడం లేదు. త్రీడి హంగామా వల్ల ఏ సెంటర్స్ లో ఉన్న మల్టీప్లెక్సులతో పాటు ఆ సౌకర్యం ఉన్న సింగల్ స్క్రీన్ల వరకు లోటు లేకుండా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి కాని ఈ బిల్డప్ కూడా లేకపోతే 2.0 పరిస్థితి వేరుగా ఉండేదని ట్రేడ్ మాట.
అదలా ఉంచితే అంతకంతా పెంచుకుంటూ పోతున్న బడ్జెట్ రాను రాను బయ్యర్లను రిస్క్ లో పెడుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీద పెట్టిన 75 కోట్ల పెట్టుబడి ఎప్పటికి రికవర్ అవుతుందో అంచనాకు అందటం లేదు. ఓ మూడు నాలుగు రోజుల తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. కాని 3.0 తీయాలంటే ఇంత కంటే ఎక్కువ రేంజ్ లో చేయాలి. అంటే ఆరేడు వందల కోట్లు దాటించేయాలి.పోనీ ధైర్యం చేసి అలా నిజంగా తీయాలనుకున్నా ఇప్పుడు 2.0 మొత్తం పెట్టుబడిని వెనక్కు ఇస్తేనే అది సాధ్యమవుతుంది.శంకర్ కూడా తనకు ఐడియా వస్తే అది కూడా రజని ఒప్పుకుంటేనే తీస్తాను అంటున్నాడు. సో 3.0 రావడం అంత ఈజీగా అయితే కనిపించడం లేదు.
వీడియో కోసం క్లిక్ చేయండి