Begin typing your search above and press return to search.
ఐదురోజుల్లో ఐ వసూళ్లు రూ.125కోట్లు
By: Tupaki Desk | 20 Jan 2015 9:39 AM GMTశంకర్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఐదురోజుల్లో 'ఐ' చిత్రం దాదాపు రూ.135కోట్ల వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ వసూళ్ల హవా సాగించింది. తొలి 5రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో 40కోట్ల గ్రాస్ (31కోట్ల నెట్) వసూళ్లు సాధించింది. ఏపీలో 21కోట్ల గ్రాస్ (18కోట్ల నెట్, 14కోట్ల షేర్) వసూలు చేసింది. నైజాంలో 11.4 కోట్ల గ్రాస్, 9.5కోట్ల నెట్, 7.07కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. కర్నాటకలో 8.15 గ్రాస్, 6.25కోట్ల షేర్ వసూలు చేసింది. కేరళలో 10.75కోట్ల గ్రాస్ (8.5కోట్ల షేర్) వసూలు చేసింది. దక్షిణాదిన రిలీజైన అన్ని చోట్లా కలుపుకుని 91కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 73కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. తమిళ్, తెలుగు కలుపుకుని మిగతా భారతదేశమంతటా 2.7కోట్ల గ్రాస్, 2కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇండియాలో హిందీ వెర్షన్ 9.3కోట్ల గ్రాస్, 7కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియా మొత్తం వసూళ్లు 103కోట్లు. అందులో నెట్ 82 కోట్లు. అమెరికాలో 8.55కోట్ల గ్రాస్, బ్రిటన్‌లో 2.4కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 1.45కోట్ల గ్రాస్, మలేసియా, సింగపూర్, దుబాయ్ సహా గల్ప్, యూరప్‌లో అన్నిచోట్లా కలుపుకుని 20కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచం మొత్తం 135.2కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీన్నుంచి 71కోట్ల షేర్ వసూళ్లను సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థాయి విజయం సాధించిన శంకర్ మునుముందు ఈ చిత్రాన్ని చైనా, జపాన్ లాంటిచోట లోకల్ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు