Begin typing your search above and press return to search.
శంకర్ చెప్పేశాడు..ఆ ఆశలు పెట్టుకోవద్దని
By: Tupaki Desk | 27 Nov 2018 7:30 AM GMTఇండియాస్ కాస్ట్లీయెస్ట్ మూవీ ‘2.0’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా.. పైగా‘రోబో’కు సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఆ అంచనాల్ని సినిమా ఏ మేరకు అందుకుంటుందో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ‘రోబో’లో అంచనాల్ని మించిన వినోదం పంచిన శంకర్.. ఈసారి అంచనాలకు దగ్గరగా వచ్చినా గొప్పే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే దీనికి ముందు నుంచి వచ్చిన హైప్ అలాంటిది. నిజానికి ‘2.0’ ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్లు లేదు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు ఇందులో కనిపించలేదు. ‘రోబో’లో మాదిరి వినోదం.. రొమాన్స్ ఇందులో ఉన్నట్లుగా కనిపించలేదు. ఒకవేళ ట్రైలర్ వరకు అవి దాచి పెట్టి సినిమాలో ఏమైనా చూపిస్తారేమో అన్న ఆశ జనాల్లో ఉంది.
కానీ అందుకు అవకాశం లేదని స్పష్టం చేశాడు శంకర్. ‘రోబో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే వినోదాత్మక సన్నివేశాలు - రొమాన్స్ ఉన్నాయి కదా.. అలాంటివి ‘2.0’లోనూ ఉంటాయా అని అడిగితే.. ‘రోబో’లో ఉన్నవన్నీ ఇందులో కూడా ఎలా ఆశిస్తారు అని ఎదురు ప్రశ్నించాడు శంకర్. ‘2.0’లో కొత్త అంశాలు ఉంటాయని.. వాటిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారని శంకర్ చెప్పాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఫిలిం అని చెప్పడం ద్వారా కామెడీ - రొమాన్స్ లాంటి వాటిపై మాత్రం ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పాడు. కొద్ది మేర మాత్రం రొమాన్స్ ఉంటుందన్నాడు. ‘2.0’లో నిరాశ పరిచిన విషయం ఇదే. పూర్తిగా రజనీ-అక్షయ్ పోరాటం మీదే సినిమా నడిపించినట్లున్నాడు. సినిమా మొత్తం యాక్షనే ఉన్నట్లుంది. వీఎఫెక్స్ మాయాజాలంతోనే సినిమా సాగేట్లుంది. ఐతే దీన్నే నమ్ముకుంటే డోస్ ఎక్కువైపోదా అన్నది డౌటు. ‘రోబో’లో మాదిరి ఎంటర్టైన్మెంట్ - రొమాన్స్ లేకుంటే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరా అని సందేహాలు కలుగుతున్నాయి. చూద్దాం మరి ఈ గురువారం ఏం జరుగుతుందో?