Begin typing your search above and press return to search.
ఇది సరికొత్త రోబో
By: Tupaki Desk | 27 Oct 2017 4:58 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం 2.0. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో మూవీ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు వస్తున్న 2.0 సినిమా రోబో పార్ట్ 2 కానేకాదని డైరెక్టర్ శంకర్ విస్పష్టంగా చెబుతున్నాడు. కేవలం రోబో సినిమాలో క్యారెక్టర్లు ఇందులో కనిపిస్తాయి తప్ప ఆ కథకు... 2.0 సినిమాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.
ఈ సినిమా కోసం సరైన స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడానికి తనకు చాలానే రోజులు పట్టిందని శంకర్ చెప్పారు. రోబో సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే 2.0 కథ ప్రారంభం అవుతుందనే మాట కూడా అబద్ధమని తేల్చిచెప్పారు. 2.0 సినిమా ప్రారంభం కావడానికి ముందు ఇందులో విలన్ పాత్ర హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగర్ చేస్తాడనే టాక్ వినిపించింది. శంకర్ ఆయనను కలిసి స్క్రిప్ట్ కూడా వినిపించాడనే ప్రచారం జరిగింది. సినిమా ప్రారంభమయ్యే నాటికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ రోల్ చేశాడు.
2.0 కథ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని... ప్రపంచవ్యాప్తంగా ఆర్నాల్డ్ తో ఈ రోల్ చేయించాలని తాము ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఆయన కెమెరా ముందుకు రాలేదని శంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా దీనికి కనెక్ట్ అవుతారని.. అందుకోసమే ఆర్నాల్డ్ ను తీసుకోవలని అనుకున్నామని తెలిపారు. మొత్తంమీద 2.0 హాలీవుడ్ ఫిలింలా ఉంటుంది తప్ప అంతా అదే తరహాలో మాత్రం ఉండదని చెప్పుకొచ్చారు.