Begin typing your search above and press return to search.
వ్యవస్థలో పురుగులపై శంకర్ కు ఎంత కోపమో!
By: Tupaki Desk | 29 Nov 2018 4:06 PM GMTసూపర్ స్టార్ రజనికాంత్ శంకర్ ల విజువల్ వండర్ 2.0 ధియేటర్లలో రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఏ రేంజ్ హిట్ ఎలాంటి వసూళ్లు వస్తాయి అనేది తేలడానికి టైం పడుతుంది కాని కించిత్ కూడా పోటీ లేని లాంగ్ వీకెండ్ ని తలైవా ఫుల్ గా వాడుకోబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వం గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉన్నా థీమ్ ని ప్రెజెంట్ చేయడంలో మునుపటి స్థాయిని చూపలేకపోయాడన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
ఇకపోతే శంకర్ లో సామాజిక స్పృహ ఎంత ఉందో మరోసారి 2.0 లో బయట పడింది. అదెలా అంటారా. మీరే చూడండి. మొదటి సినిమా జెంటిల్ మెన్ మొదలుకుని ఇవాల్టి 2.0 దాకా తన సినిమాల్లో హీరోలు వ్యవస్థకు చీడపురుగుల్లా మారి డబ్బు కోసం దిగజారిన వాళ్ళను హత్య చేయడం కామన్ గా కనిపిస్తుంది. జెంటిల్ మెన్ లో ముఖ్య మంత్రి-ప్రేమికుడులో గవర్నర్- భారతీయుడులో ప్రభుత్వాధికారులు- ఒకే ఒక్కడులో మాజీ సిఏం-ఐలో పెద్ద మల్టీ మిలియనీర్ ఇలా అందరు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు ఎంత తప్పు చేసినా వదలకూడదు అనేది శంకర్ సిద్దాంతంగా చూపిస్తాడు.
2.0 కూడా దీనికి మినహాయింపుగా నిలవలేదు. రేడియేషన్ వల్ల పక్షుల ప్రాణాలు అంతరిచిపోయేలా చేస్తున్న కొందరిని శంకర్ ఇందులో టార్గెట్ చేయించాడు. కాకపోతే హీరో బదులు విలన్ తో చేయించాడు. దీన్ని బట్టి సామాన్య జనం ఎవరి వల్ల అయితే తీవ్రంగా నష్టపోతున్నారో వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కు లేదనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నట్టే. నిజానికి ఇలాంటి సామాజిక స్పృహే శంకర్ కు అశేషమైన అభిమానులను సంపాదించి పెట్టింది.
కాకపోతే హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ని ఇండియన్ స్క్రీన్ మీద చూపలన్న తపన తో కాస్త కథనం మీద ఫోకస్ తగ్గించారన్న మాట ఐ సమయంలోనూ ఇప్పుడూ వినిపిస్తోంది. అయితే 2.0కు ఇది ఎంత వరకు ప్రతిబంధకంగా మారుతుంది అనేది వీకెండ్ పూర్తయ్యాక కాని క్లారిటీ రాదు. నాలుగు రోజుల వారాంతాన్ని చిట్టి భారీగా ఆక్రమించుకోవడం మాత్రం ఖాయమే