Begin typing your search above and press return to search.

ఫిట్ నెస్‌ కూ స్ర్కిప్టుకూ లింకేంటి సార్‌?

By:  Tupaki Desk   |   17 Aug 2015 9:52 AM GMT
ఫిట్ నెస్‌ కూ స్ర్కిప్టుకూ లింకేంటి సార్‌?
X
తీసేది సౌత్ సినిమాలే అయినా.. విభిన్నమైన కాన్సెప్టు లతో దేశం మొత్తాన్ని ఆకట్టుకునే దిగ్గజ డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఈయన ఎందిరన్2(రోబో2) స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఈయన ఫిట్నెస్ సెంటర్లలోనూ, జిమ్ లోనూ దర్శనిస్తున్నారు. ఆలోచనలు స్థిరంగా ఉండాలనే.. మనసు నియంత్రణలో ఉండాలని.. ఇందుకు శరీరం కూడా ఫిట్ గా ఉండాలని చెబ్తున్నారు శంకర్. రోజుకు 3 గంటలపాటు జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న శంకర్... ఇప్పుడు రోబో2 స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

పూర్తిస్థాయి స్క్రిప్ట్ చేతిలో లేనిదే సెట్స్ మీదకు వెళ్లే అలవాటు ఈయనకు లేదు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని, 2-3 వారాల్లో మిగతాది కూడా పూర్చి చేసేసి... అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలన్నది శంకర్ యోచన. మనదేశంలో మూవీస్ కి... ఇఫ్పుడు రోబో అంటే రజినీకాంత్ మాత్రమే. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే రోబో2లో విలన్ పాత్రలో విక్రమ్ నటించబోతుండడం విశేషం. ఇప్పుడు చియాన్ వెరైటీ మీసకట్టు పెంచుతున్నాడు. అయితే ఇది రోబో2 కోసమే అని మాత్రం స్పష్టం చేయలేదు. మరోవైపు విక్రం కొడుకు ధృవ్ ను వెండితెరకు పరిచయం చేయాల్సిందిగా శంకర్ ను కోరాడట విక్రం. దీనికి హామీ దీసుకున్నాకే... విలన్ గా నటించేందుకు అంగీకరించాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.

రజినీకాంత్ తో రంజిత్ దర్శకత్వం వహించబోతున్న చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుంది. ఈ మూవీకి కబాలి అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. రజినీ పోషిస్తున్న మాఫియా డాన్ కేరక్టర్ పేరు కబాలీశ్వరన్ కావడంతో ఈ పేరుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కబాలి కోసం మూడు నెలలు బిజీగా ఉంటారు సూపర్ స్టార్. తర్వాత రోబో 2 మొదలువుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో శంకర్, రజినీ, విక్రంల మూవీ సెట్స్ మీదకు వెళ్తుందన్నమాట.