Begin typing your search above and press return to search.
శంకర్ మరో యాభై కోట్లు పెంచేశాడు
By: Tupaki Desk | 3 Dec 2016 11:36 AM GMTరోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0.. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ అనే సంగతి తెలిసిందే. ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడం.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి మరింత జోష్ ని ఇచ్చింది. అందుకే బడ్జెట్ విషయంలో పరిధులు పెట్టుకోవద్దని దర్శకుడు శంకర్ కి చెప్పారట.
గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు.. మరో 50 కోట్లు పెట్టుబడికి ఒప్పుకున్నారట నిర్మాతలు. దీంతో 2.0 బడ్జెట్ ఏకంగా 400 కోట్లకు చేరుకుంది. ఇండియాలోనే కాదు.. ఆసియాలో రూపొందిన ఏ మూవీతో చూసుకున్నా ఇదే అతి పెద్ద బడ్జెట్. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒకేసారి 6 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు.. తమిళ్.. హిందీ.. ఇంగ్లీష్.. జపనీస్.. చైనీస్ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారట.
వచ్చే ఏడాది దీపావళికి 2.0 విడుదల కానుండగా.. ఈ మూవీలోని ఓ పాట కోసం ఉక్రెయిన్ దేశాన్ని ఇండియాలో రీక్రియేట్ చేస్తూ పాట పిక్చరైజేషన్ జరుగుతుండగా.. ఈ నెలాఖరుతో షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/